విడాకుల గురించి అమ్మా నాన్నలని నేరుగా అడిగాను… రోషన్ కామెంట్స్ వైరల్?

తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల ( Suma Kanakala )ఒకరు ఈమె గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నారు.

ఇక సుమ నటుడు రాజీవ్ కనకాలను( Rajeev Kanakala ) పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది.

వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని విడాకులు( Divorce ) తీసుకొని విడిపోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/12/roshan-kanakala-gives-clarity-about-suma-rajeev-kanakala-orcea!--jpg" / ఇలా సుమ రాజీవ్ ఇద్దరు వేరువేరుగా ఉన్నారని వీరిద్దరూ త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై సుమ అలాగే రాజీవ్ ఇద్దరు కూడా తీవ్రంగా ఖండించారు.

అయినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.ఇకపోతే తాజాగా వీరిద్దరి విడాకుల గురించి వీరి కొడుకు రోషన్ ( Roshan ) చేసినటువంటి కామెంట్స్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

త్వరలోనే రోషన్ హీరోగా ఇండస్ట్రీకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.దీంతో ఈయన తన సినిమా ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/12/roshan-kanakala-gives-clarity-about-suma-rajeev-kanakala-orced!--jpg" / ఒకసారి నేను అమ్మతో కలిసి ఒక ఈవెంట్ కి వెళ్ళాను అప్పుడే తనకు ఇండస్ట్రీలో కొనసాగాలని ఆసక్తి కలిగిందని అందుకే నేను నటనలో శిక్షణ కూడా తీసుకొని ఇండస్ట్రీలోకి హీరోగా రాబోతున్నాను అంటూ తన గురించి తెలియజేశారు.

అయితే తన తల్లిదండ్రుల విడాకుల గురించి కూడా ప్రశ్నలు ఎదురుగా ఈయన స్పందిస్తూ రోజు సోషల్ మీడియాలో అమ్మ నాన్న విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చేవి కానీ అమ్మానాన్న మాత్రం సరదాగా కబుర్లు చెబుతూ ఉండేవారని దీంతో ఒకరోజు మీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతున్నారా అంటూ వారిని అడిగానని తెలిపారు.

దీంతో అమ్మ ఛీ ఛీ అలాంటిదేం లేదురా అంటూ చెప్పారు.ఇలా విడాకులు వార్తలు ఒకవైపు వస్తున్న వీరు సంతోషంగా ఉండడంతో కొంత గందరగోళానికి గురయ్యానని కానీ అదంత ఫేక్ అని అర్థమైందని మా అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు అంటూ ఈ సందర్భంగా రోషన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బెంగళూరు వ్యక్తి జీనియస్ ఐడియా.. ట్రాఫిక్‌లోనే తెలివిగా మీటింగ్స్‌..?