రోజ్ వాటర్‌ను కళ్లపై అప్లై చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!

రోజ్ వాట‌ర్ దీని గురించి ప‌రిచ‌యాలే అవ‌స‌రం లేదు.సహజమైన గులాబీ రేకులను నీటిలో నానబెట్టి ఈ రోజ్ వాట‌ర్‌ను తయారు చేస్తారు.

అటువంటి రోజ్ వాట‌ర్ సౌంద‌ర్య ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.అందుకే రోజ్ వాట‌ర్‌ను ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా అంద‌రూ చ‌ర్మ సంర‌క్ష‌ణ‌లో అనేక విధాలుగా ఉప‌యోగిస్తున్నారు.

అయితే రోజ్‌వాటర్ చర్మ సౌందర్యానికి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అలానే కళ్ళకు కూడా అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

"""/"/ సాధార‌ణంగా క‌ళ్ల చుట్టు న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను త‌గ్గించుకునేందుకే రోజ్ వాట‌ర్‌ను చాలా మంది అప్లై చేస్తుంటారు.

కానీ, రోజ్ వాట‌ర్‌ను క‌ళ్ల పై అప్లై చేయ‌డం వ‌ల్ల మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

అవేంటో ఆల‌స్యం చేయ‌కుండా చూసేయండి.నేటి ఆధునిక కాలంలో అంద‌రూ స్మార్ట్ ఫోన్‌, ల్యాప్ టాప్స్ వంటి ప‌రిక‌రాల‌తోనే ఎక్కువ‌గా స‌మయాన్ని గ‌డిపేస్తున్నారు.

ఫ‌లితంగా, కళ్లు త‌ల‌చూ అల‌స‌ట‌కు గుర‌వుతుంటారు.అయితే ప్ర‌తి రోజు నిద్రించే ముందు స్వ‌చ్ఛ‌మైన రోజ్ వాట‌ర్‌ను క‌ళ్లపై అప్లై చేయాలి.

ఇలా చేస్తే కంటి అలసట నుంచి మంచి ఉపశమనం ల‌భిస్తుంది.అలాగే క‌ళ్లపై రోజా వాట‌ర్ అప్లై చేసుకోవ‌డం వ‌ల్ల‌ మెదడులోని పిచ్చి పిచ్చి ఆలోచ‌న‌లు పోయి ప్ర‌శాంతంగా మారుతుంది.

ఒత్తిడి, త‌ల‌నొప్పి, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేస్తుంది.నిద్ర ప‌ట్టిని వారు ప‌డుకునే ముందు క‌ళ్ల‌పై కొద్దిగా రోజ్ వాట‌ర్ అప్లై చేయ‌డం వ‌ల్ల‌ రోజంతా అలసిపోయిన మీ కళ్లకు మంచి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డంతో పాటు మంచి నిద్ర కూడా ప‌డుతుంది.

కంప్యూటర్‌ ముందు ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వాళ్లు ప్ర‌తి రోజు రోజ్‌వాటర్‌ను క‌ళ్లపై అప్లై చేసుకుంటే చాలా మంచిది.

ఇక రోజ్ వాట‌ర్‌ను ఐ మేకప్ తొలగించ‌డంలోనూ ఉప‌యోగించ‌వ‌చ్చు.

సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అయినా అసంతృప్తికి లోనైన దర్శకులు వీళ్లే!