హరికేన్ విధ్వంసం : ఫ్లోరిడా పర్యటనకు జో బైడెన్ .. ఈ సమయంలో అధ్యక్షుడిని కలవలేమన్న డిసాంటిస్
TeluguStop.com
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) శనివారం ఫ్లోరిడాలో పర్యటించనున్నారు.
హరికేన్ ఇడాలియా వల్ల సంభవించిన నష్టాన్ని పరిశీలించడానికి ఆయన ఇక్కడకు వస్తున్నారు.అయితే రాష్ట్రంలో సహాయక పునరావాస ప్రయత్నాలను పర్యవేక్షిస్తూ బిజీగా వున్న గవర్నర్ రాన్ డిసాంటిస్‌ను మాత్రం ఆయన కలవరని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి డిసాంటిస్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఒకవేళ రిపబ్లికన్ పార్టీ( Republican Party ) నామినేషన్ సంపాదిస్తే మాత్రం డిసాంటిస్ .
బైడెన్‌కు ప్రత్యర్ధి అవుతారు.అయితే రాష్ట్రపతిని వ్యక్తిగతంగా పలకరించే ఆలోచన ఆయనకు లేనట్లుగా తెలుస్తోంది.
"""/" /
గవర్నర్ .ప్రెసిడెంట్‌ను కలవడానికి ఎలాంటి ప్రణాళికలు లేవని డిసాంటిస్( Ron DeSantis ) ప్రెస్ సెక్రటరీ జెరెమీ రెడ్‌ఫెర్న్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హరికేన్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు చేయడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని రెడ్‌ఫెర్న్ అన్నారు.
అయితే జో బైడెన్, అధ్యక్షుడి హోమ్‌లాండ్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎలిజబెత్ షేర్‌వుడ్ రాండాల్ చెప్పిన దానికి ఈ ప్రకటన పూర్తి విరుద్ధంగా వుంది.
"""/" /
మీడియా సమావేశం సందర్భంగా మీరు గవర్నర్ డిసాంటిస్‌ను కలుస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు బైడెన్ అవును అని సమాధానం ఇచ్చారు.
గతేడాది హరికేన్ కారణంగా ఫ్లోరిడా( Florida )లో చోటు చేసుకున్న విధ్వంసం సమయంలో సహాయక చర్యల సందర్భంగా ఇద్దరు నేతలు కలిసి పనిచేశారు.
ఈ నేపథ్యంలోనే తాజా ఫ్లోరిడా పర్యటన సందర్భంగా గవర్నర్‌తో అధ్యక్షుడు భేటీ అవుతారని తాము ఆశిస్తున్నట్లుగా షేర్‌వుడ్ చెప్పారు.
విపత్కర పరిస్ధితుల్లో వున్న ఫ్లోరిడా పౌరులకు సహాయం చేయడానికి సమిష్టిగా వుండాలన్నారు.అయితే .
ఫ్లోరిడా గవర్నమెంట్ మాత్రం బైడెన్ సందర్శన వల్ల ఇడాలియా ప్రభావిత గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు విఘాతం కలిగిస్తుందన్నారు.
ఈ తుఫాను 3వ కేటగిరీకి చెందిన హరికేన్.ఇది ఫ్లోరిడాలోని బిగ్‌బెండ్ ప్రాంతంలో బలమైన గాలులు, భారీ వర్షంతో విరుచుకుపడింది.
నాగచైతన్యతో పరిచయం, ప్రేమ, పెళ్లి పై శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు!