రొమాంటిక్ బ్యూటీ ఆశలన్నీ ఆ సినిమా మీదే..!

రొమాంటిక్ బ్యూటీ ఆశలన్నీ ఆ సినిమా మీదే!

టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన ఢిల్లీ భామ కెతిక శర్మ పూరీ, ఛార్మీ కలిసి నిర్మించిన రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.

రొమాంటిక్ బ్యూటీ ఆశలన్నీ ఆ సినిమా మీదే!

పూరీ తనయుడు ఆకాష్ హీరోగా రొమాంటిక్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమాలో కెతిక శర్మ తన అందాలతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది.

రొమాంటిక్ బ్యూటీ ఆశలన్నీ ఆ సినిమా మీదే!

ఆ తర్వాత నాగ శౌర్యతో లక్ష్య సినిమాలో నటించింది కెతిక శర్మ.ఇక ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా చేసింది కెతిక శర్మ.

అర్జున్ రెడ్డి సినిమాని తమిళంలో తెరకెక్కించిన గిరీశయ్య డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా రంగ రంగ వైభవంగా.

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కెతిక శర్మ హీరోయిన్ గా నటించింది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది కెతిక శర్మ.

ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ముందు జూలై 8న రిలీజ్ ఫిక్స్ చేసినా అనుకోకుండా వాయిదా వేశారు.

ఫైనల్ గా సెప్టెంబర్ 2న ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు వస్తుంది.ఈ సినిమాలో కూడా రొమాంటిక్ సీన్స్ లో నటించింది కెతిక శర్మ.

రొమాంటిక్, లక్ష్య సినిమాల తర్వాత మూడవ సినిమాగా రంగ రంగ వైభవంగా వస్తుంది.

మరి ఈ సినిమాతో అయినా కెతిక శర్మ అనుకున్న విధంగా సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.

ఈ సినిమా రిలీజ్ అవకుండానే మరో రెండు సినిమాలు కెతిక లిస్ట్ లో ఉన్నాయని తెలుస్తుంది.

రంగ రంగ వైభవంగా సినిమాపై వైష్ణవ్ తేజ్ కూడా చాలా అంచనాలు పెట్టుకున్నాడు.

ఉప్పెన హిట్ అవగా తర్వాత చేసిన కొండపొలం ఫ్లాప్ గా నిలిచింది.అందుకే రంగ రంగ వైభవంగా సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

సర్జరీ చేయించుకున్న యాంకర్ ప్రదీప్… అందుకే గ్యాప్ ఇచ్చారా.. ఏమైందంటే?

సర్జరీ చేయించుకున్న యాంకర్ ప్రదీప్… అందుకే గ్యాప్ ఇచ్చారా.. ఏమైందంటే?