బాలయ్య చంద్రబాబు తింగరోళ్లు.. రోజా షాకింగ్ కామెంట్స్ వైరల్!

వైసీపీ మంత్రి, ఎమ్మెల్యే రోజా అన్ స్టాపబుల్ ప్రోమో గురించి ఫస్ట్ ఎపిసోడ్ గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు.

బావబావమరిది అన్ స్టాపబుల్ షో వేదికగా కన్నార్పకుండా అబద్ధాలు చెప్పారని రోజా అన్నారు.

పదవీ దాహంతో చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని రోజా కామెంట్లు చేశారు.

కాళ్లు పట్టుకుని ఏడ్చానని తప్పా అని అడగటం ద్వారా చంద్రబాబు ప్రజలను పిచ్చోళ్లను చెయ్యాలని అనుకుంటున్నారని రోజా చెప్పుకొచ్చారు.

పచ్చ మీడియా ద్వారా చెబితే ప్రజలు నమ్మడం లేదని భావించి బాలయ్య, చంద్రబాబు అన్ స్టాపబుల్ షో ద్వారా చెబుతున్నారని రోజా అన్నారు.

ప్రజలు పిచ్చోళ్లు కాదని బాలయ్య, చంద్రబాబు తింగరోళ్లని రోజా చెప్పుకొచ్చారు.బాలయ్య, చంద్రబాబు చెప్పే మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారని రోజా కామెంట్లు చేశారు.

అన్ స్టాపబుల్ ప్రోమో విషయంలో ఎన్ని వివాదాలు వచ్చాయో చూశారని చంద్రబాబు నాయుడు తన ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని చెబుతుండటం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని రోజా తెలిపారు.

చంద్రబాబుకు కావాల్సింది పదవి అని సీఎం పదవి కోసం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని ఏ విధంగా వాడుకున్నారో తెలుసు కదా అని రోజా అన్నారు.

రోజా చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అన్ స్టాపబుల్ షో ఫస్ట్ ఎపిసోడ్ లో బాలయ్య, చంద్రబాబు వెన్నుపోటు అంశం గురించి స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"""/"/ ఆహా ఓటీటీకి మాత్రం ఈ షో అన్ని విధాలుగా ప్లస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అన్ స్టాపబుల్ షో2 ఫస్ట్ సీజన్ ను మించి సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అన్ స్టాపబుల్ షో సీజన్2 కు రాబోయే వారాల్లో హాజరయ్యే గెస్ట్ లు ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం వెనక ఎవరు ఉన్నారు…