పవన్ కళ్యాణ్ పై పొలిటికల్ కామెంట్స్ చేసిన మినిస్టర్ ఆర్కే రోజా...

ఏపీ టూరిజం మినిస్టర్ ఆర్కే రోజా కామెంట్స్ జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నము.

రేపు సాయంత్రం నాలుగు గంటలకు జబర్దస్త్ టీం చేతుల మీదగా విజేతలకు బహుమతి ప్రధానం చేస్తాం.

ఈ కార్యక్రమానికి అనసూయ, జబర్దస్త్ టీం వస్తారు.50 లక్షలు చొప్పున బహుమతి ప్రధానం చేస్తాము.

కలలు అనేవి మరుగున పడిపోతున్నాయి.వాటిని మళ్లీ ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది.

ఇప్పుడు నేను మంత్రిని కావచ్చు కానీ నేను ఒకప్పటి కళాకారిణిని.జగనన్న జన్మదిన వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఉంది.

ఎమ్మెల్యే ,మంత్రి కావాలని నా కోరికను జగనన్న తీర్చాడు.తనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను.

పవన్ కళ్యాణ్ పై పొలిటికల్ కామెంట్స్ చేసిన రోజా.పవన్ కళ్యాణ్ ను హీరోగా కళాకారుడుగా గౌరవిస్తాం.

రాజకీయాలంటే పూర్తిస్థాయిలో పనిచేయాలి వీకెండ్స్ లో వచ్చి కనబడి వెళ్లడం కాదు.పవన్ కళ్యాణ్ అతని అన్నలు రాజకీయాలకు సూట్ కారు.

పవన్ కళ్యాణ్ కి అటువైపు ఇటువైపు నాదెండ్ల మనోహర్, ఆయన అన్న నాగబాబు తప్ప ఇంకెవరు ఉన్నారు.

పవన్ కళ్యాణ్ నిలబడ్డ రెండు చోట్లలో ఒకచోట కూడా గెలవలేదు.పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేవు.

ఇక నీవు జగన్ అన్నని ఏం ఓడిస్తావ్.