రోజా పువ్వు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఉపయోగం..

రోజాపులు ఆడవారి అందాన్ని పెంచడమే కాదు మనషుల ఆరోగ్యాని కూడా కాపాడుతాయనే విషయం కొందరికి మాత్రమే తెలుసు.

రోజా పువ్వుల యొక్క ఉపయోగాలు మానవులకు ఏ విధంగా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం.వీర్యవృద్ది: రోజా రేకులను రోజు ఓ గుప్పెడు తినడం వలన శృంగార సమస్యలు ఏమైనా ఉంటె తొలిగిపోతాయి, తాజాగా జరిపిన శాస్త్రీయ పరిశోదనలో తేలినది ఏమిటి అంటే రక్తం శుద్ధి చేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

సాధారణంగా వీటికి వీర్య వృద్దిని పెంచే గుణం కలిగి ఉంది. """/" /  మొటిమలు, మచ్చలు మాయం: యువతీ యువకులు యుక్త వయసుకు రావడం వలన బాడీ లోని హార్మోన్స్ ప్రభావం వలన మొఖం పైన నల్ల మచ్చలు మొటిమలు రావడం జరుగుతుంది.

వీటిని పోగట్టడానికి రోజా పువ్వు రేకులు ఎంతగానో ఉపయోగపడుతాయి.ఎలాగా అనగా రోజా పువ్వు రేకులను తీసుకుని వేడి నీటిలో బాగా మరిగించి ఒక ముద్దగా చేసి, దానికి ముల్తాన మట్టిని కలిపి వారానికి ఒక్కసారి మొఖంకు రాసుకోవడం వలన మొఖం పైన ఉండే నల్ల మచ్చలు పోతాయి, మీ చర్మం ఎంతో కాంతి వంతంగా మెరుస్తుంది.

రోజా రేకుల కాషాయం: రోజా రేకుల కషాయాన్ని మనం మన ఇంట్లోనే తాయారు చేసుకోవచ్చు దీనికి కావలిసినవి రోజా పులు మరియు నీరు మాత్రమే.

రోజా రేకుల కషాయాన్ని తాగడం వలన చర్మం ఎంతో కాంతి వంతంగా మెరుస్తుంది.

ఈ కషాయం ఆరోగ్యానికి ఎంతో మంచిది.బయట మార్కెట్లో లభించే ఔషధాల కంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది.

మొఖం పైన మొటిమలు మచ్చల వలన ఏర్పడిన కుపములని తొలగిస్తుంది. """/" /  బరువు తగ్గడం: రోజా రేకుల్లో ఉండే పదార్ధాలు మనిషి బరువు తగ్గడానికి దోహదపడుతాయి.

రోజరేకులకు కాస్త మెంతులు కలిపి ఓ పేస్ట్ లాగా తాయారు చేసుకుని రోజు తినడం వలన బరువు తగ్గి నాజూకు తనం వస్తుంది.

లేదా రోజా రేకుల కషాయాన్ని రోజు తాగడం వలన మనిషి సన్నబడుతాడు.రోజా పువ్వుల వాసన: రోజపువ్వులనుండి వచ్చే వాసన వలన మనసుకి ప్రశాంతత కలుగుతుంది.

మనసుకి ఎంతో ఉతేజ్జాని ఇస్తుంది.రోజు ఎన్నో సమస్యలతో మానవుడు సతమత మవ్వుతూ, ఎంతగానో ఒత్తిడికి లోనవుతూ ఉంటాడు.

అలాంటి వారికీ రోజా రేకులు ఎంతగానో ఉపయోగపడుతాయి.వేడి నీటిలో రోజా రేకులను, కొంచెం బాత్ సాల్ట్ ను కలిపి, ఈ మిశ్రమాన్ని ఓ పద్ధతి ప్రకారం గనుక మనం పిల్చీతే తప్పకుండ ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

వీల్ చైర్ లో నటి రష్మిక మందన్న…షాక్ లో అభిమానులు!