డాక్టర్ కాబోతున్న రోజా దత్త పుత్రిక.. సంతోషం వ్యక్తం చేసిన రోజా?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఒకానొక సమయంలో వెండితెరపై ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె అనంతరం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి కొన్ని సినిమాలలో నటించారు.
అయితే వెండితెరపై కన్నా ఈమె బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు.
అయితే ఈమె సినిమా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా ప్రస్తుతం మంత్రి హోదాలో రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇలా సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలోనూ బిజీగా ఉన్నటువంటి ఈమె సామాజిక సేవ కార్యక్రమాలను చేయడంలో కూడా ముందు వరుసలో ఉంటారు.
ఇకపోతే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రోజా ఓ అమ్మాయిని దత్తత తీసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తన చదువు బాధ్యతలు అన్నింటిని తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు.
ఇలా చదువులో ఎంతో మంచిగా రాణిస్తున్నటువంటి పుష్ప అనే అమ్మాయి పదో తరగతి చదువుతున్న సమయంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయింది.
దీంతో అనాధగా మిగిలినటువంటి పుష్ప కాలేజ్ ప్రిన్సిపల్ చొరవతో హాస్టల్లో ఉండి ఇంటర్ పూర్తి చేసింది.
ఈ క్రమంలోనే తనని కాలేజ్ ప్రిన్సిపల్ రోజా వద్దకు తీసుకెళ్లడంతో ఆమె జగన్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప చదువు బాధ్యతలనుతాను చూసుకుంటానని హామీ ఇచ్చారు ఈ క్రమంలోని నీట్ పరీక్ష కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా పంపించారు.
"""/"/
అయితే ప్రస్తుతం ఈమె తిరుపతిలోని పద్మావతి మహిళ యూనివర్సిటీలో వైద్య విద్యలో కొనసాగుతున్నారు త్వరలోనే ఈమె డాక్టర్ కాబోతున్నారని తెలియడంతో రోజా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇక ఈ విషయంలో పుష్ప మాట్లాడుతూ తన తల్లిదండ్రులు వైద్యం లేక మరణించారని ఇలా ఎంతో మంది సరైన సమయంలో వైద్యం అందక మరణిస్తున్నారని ఈమె ఆవేదన చెందారు.
ఈ విధంగా తన తల్లిదండ్రులు మరణించడంతో తాను వైద్యురాలిగా మారి పేద ప్రజలకు వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే డాక్టర్ కోర్స్ లో చదువుతున్నానని,తనకు ఇలాంటి అద్భుతమైన అవకాశం కల్పించిన మంత్రి రోజా గారికి ఈమె కృతజ్ఞతలు తెలియజేశారు.
పుష్ప 2 సుకుమార్ కి ఏ రేంజ్ లో హిట్ ఇవ్వబోతుంది…