మునుగోడు ఆర్వోగా రోహిత్ సింగ్ బాధ్యతలు

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.మునుగోడు ప్రస్తుత రిటర్నింగ్ ఆఫీసర్ జగన్నాధరావుపై వేటు వేసింది.

గుర్తుల కేటాయింపులో జగన్నాధరావు తీరుపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.అనంతరం ఉపఎన్నిక విధుల నుంచి తప్పించింది.

అనంతరం ఆయన స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవోగా పనిచేస్తున్న రోహిత్ సింగ్ కు ఉపఎన్నిక బాధ్యతలను అప్పగించింది.

మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈసీ తీరు సరికాదని తెలిపారు.బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేస్తుందో అనే దానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు.

చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా ఈ రెమెడీతో శాశ్వతంగా వదిలించుకోండి!