బామ్మర్ది పెళ్లి వేడుకలో భార్యతో కలిసి రోహిత్ శర్మ స్నేక్ మూమెంట్ స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా..!

రోహిత్ శర్మ( Rohit Sharma ) గురువారం తన బామ్మర్ది పెళ్లి వేడుకలో పాల్గొని భార్య రితికాతో కలిసి వేదికపై డ్యాన్స్ వేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.

గురువారం రాత్రి వేదికపై స్నేక్ మూమెంట్ స్టెప్పులు వేస్తూ, సరదాగా డబ్బులు విసురుతూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి, పెళ్లి వారందరినీ ఆశ్చర్యపరిచాడు.

రోహిత్ శర్మ డ్యాన్స్ కు బంధువులతో పాటు, అభిమానులు కూడా ఫిదా అయ్యారు.

కొందరైతే రోహిత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరైతే అలాంటి డ్యాన్స్ చేసి ఉంటే బాగుండేది.ఇలాంటి డ్యాన్స్ చేసి ఉంటే బాగుండేది అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి రోహిత్ శర్మ మంచి క్రికెటర్ మాత్రమే కాదు మంచి డ్యాన్సర్ అనిపించుకుంటున్నాడు.

కేవలం క్రికెట్ అభిమానులు కాదు నెటిజన్స్ కూడా రోహిత్ శర్మ వీడియోను అద్భుతంగా ఉందంటూ పొగుడుతున్నారు.

"""/" / బామ్మర్ది పెళ్లి కారణంగా రోహిత్ శర్మ, వాంఖడే స్టేడియంలో ( Wankhede Stadium )ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డే మ్యాచ్ కు దూరం అవడంతో, హార్థిక్ పాండ్యా( Harthik Pandya ) సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగింది.

తర్వాత జరిగే రెండు వన్డేలకు రోహిత్ శర్మ భారత జట్టుకు సారథ్యం వహిస్తాడని బీసీసీఐ ప్రకటించింది.

అంతేకాకుండా ఇటీవలే జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer )వన్డే సిరీస్ కు దూరమయ్యాడు.

మరొకపక్క బుమ్రా కూడా గాయం కారణంగా ఈ సిరీస్ కు దూరం కావడం జరిగింది.

ఇక పోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో బెర్త్ కన్ఫామ్ చేసుకోవడం కోసం శార్థూల్ ఠాగూర్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా లు వన్డేలలో రాణించి భారత జట్టులో చోటు పదిలంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఆ మేనరిజమ్స్‌ జనంలోనుండి పుట్టినవే.. అందుకే నాకింత పాపులారిటీ: మెగాస్టార్