ఫామ్ కోల్పోయిన హిట్ మ్యాన్.. డేంజర్ లో కెప్టెన్సీ పదవి..!

ఈ ఐపీఎల్ లో ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma )ఫామ్ కోల్పోయి డకౌట్లతో పెవీలియన్ చేరుతున్నాడు.

దీంతో ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్సీ పదవి డేంజర్ జోన్లో ఉన్నట్లు అనిపిస్తుంది.

భారత జట్టు 2013లో వన్డే ఛాంపియన్ ట్రోఫీ( World Cup ) గెలిచిన తర్వాత అంతర్జాతీయంగా మరొక ట్రోఫీని గెలవలేదు.

సెమిస్ కు చేరడం లేదంటే ఫైనల్ వరకు చేరడం తప్ప గెలిచింది లేదు.

మహేంద్రసింగ్ ధోని తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.

విరాట్ కోహ్లీ నాయకత్వంలో టీమిండియా ఐసీసీ ఈవెంట్లో రాణించలేకపోయింది.దీంతో 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు.

"""/" / ప్రస్తుతం రోహిత్ శర్మ భారత జట్టు కెప్టెన్ గా ఉన్నాడు.

ఇతని నాయకత్వంలో కూడా పెద్దగా మార్పులు ఏమి కనిపించలేదు.మరోసారి భారత జట్టు సెమిస్ గడ్డపై బోల్తా పడింది.

అంతేకాకుండా రోహిత్ శర్మ ఫామ్ కోల్పోయి ఐపీఎల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు.దీంతో తన భారత కెప్టెన్సీ పదవి కూడా డేంజర్ జోన్ లో పడింది.

"""/" / ఈ సమయంలో రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా పెద్ద తలనొప్పిగా మారాడు.

ఎందుకంటే 2022లో గుజరాత్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించి జట్టును ఛాంపియన్షిప్ గా నిలబెట్టాడు.

ఇక ఈ ఐపీఎల్ సీజన్లో కూడా గుజరాత్ జట్టు హార్దిక్ పాండ్యా సారథ్యంలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.

అంతేకాకుండా గుజరాత్ జట్టు దాదాపుగా ప్లే ఆఫ్స్ కు చేరినట్టే. """/" / ఇప్పటికే భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ( Hardik Pandya )ఎంపిక అయ్యాడు.

ఇక ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ వరకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండే ఛాన్స్ ఉంది.

కానీ ఈ ఐపీఎల్ లో గుజరాత్ జట్టు ఛాంపియన్ గా నిలిస్తే మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్సీ పదవి ముగిసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

తన కెప్టెన్సీ పదవి పోకూడదంటే మరికొన్నెళ్లు రోహిత్ శర్మ ఫామ్ లోనే ఉండాలి.

అలాకాకుండా అయితే రోహిత్ శర్మ స్థానం చేజారి హార్దిక్ పాండ్యా టీమిండియా జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

బాలినేని కౌంటర్ :  చెవిరెడ్డి అవి బయటపెట్టమంటారా ?