స్విగ్గీని నిషేధించాలంటున్న హిట్ మ్యాన్ ఫ్యాన్స్‌.. ఎందుకంటే..?

ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గి సంస్థపై టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.

స్విగ్గి యాప్ ను పూర్తిగా నిషేధించాలంటూ పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.ఇందుకు కారణం స్విగ్గి సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్.

ఆ పోస్టులో ఓ ఎవరో తెలియని వ్యక్తి చేసిన మీమ్ ను స్విగ్గి రిపోర్ట్ చేసింది.

అయితే అందులో ఉన్న ఫోటోలు ఓ రోడ్ సైడ్ లో ఉన్న వడ పావ్ ని క్యాచ్ పట్టినట్లుగా ఓ వ్యక్తి మీమ్ క్రియేట్ చేసినట్లు ఉంది.

అయితే ఈ ఫోటోను స్విగ్గి రీ పోస్ట్ చేస్తూ ఊరుకాకుండా ద్వేషించే వాళ్లు ఇది ఫోటోషాప్ చేసిందని అనుకుంటారు అంటూ కామెంట్ చేసింది.

అయితే ఈ కామెంట్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు అసలు నచ్చలేదు.దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ స్విగ్గి యాప్ పై చెలరేగి పోయారు.

సోషల్ మీడియాలో పెద్దఎత్తున బాయ్ కాట్ స్విగ్గి పేరుతో హాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు.

భారతదేశం నుంచి ఆడుతున్న ఓ అంతర్జాతీయ క్రీడాకారుని అవమానించేలా ఈ పోస్ట్ ఉందని స్విగ్గి ఆపై పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురుస్తుంది.

మరికొందరైతే స్విగ్గి యాప్ ను బ్యాన్ చేసి.తాము జోమోటో వెళ్లిపోతానని హెచ్చరించడం మొదలుపెట్టారు.

అంతేకాదు రోహిత్ శర్మ కి క్షమాపణ చెప్పకపోతే కనుక కచ్చితంగా స్విగ్గి యాప్ ను తమ మొబైల్ నుంచి అన్ఇన్స్టాల్ చేస్తామని స్పష్టంగా తెలియజేశారు.

"""/"/ సోషల్ మీడియా లో జరుగుతున్న స్విగ్గి యాప్ పై ఎట్టకేలకు స్విగ్గి సంస్థ దిగివచ్చింది.

ఇందుమూలంగా స్విగ్గి తాము ఎవరో చేసిన మీమ్ ను రిపోస్ట్ మాత్రమే తప్ప తాము ఆ ఫోటో ని క్రియేట్ చేయలేదని అయితే ఇంతకన్నా మంచి కామెంట్ రాసి ఉండాల్సిందని వివరణ ఇచ్చుకుంది.

వీటితో పాటు తమకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదంటూ ట్విట్టర్ లో స్విగ్గి తెలిపింది.

మొత్తంగా ఈ సమస్యకు కారణమైన ట్వీట్ ను స్విగ్గీ సంస్థ డిలీట్ చేసింది.

జగన్ కోసం సిద్ధం : ప్రతి ఇంటికి వెళ్లేలా సరికొత్త ప్లాన్