వరల్డ్ కప్ లో మరో మైలురాయి దాటిన రోహిత్ శర్మ..!
TeluguStop.com
వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohith Sharma ) ఫుల్ ఫామ్ కొనసాగిస్తూ పాత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.
ఈ టోర్నీ తొలి మ్యాచ్లో డక్ ఔట్ అయిన రోహిత్ శర్మ రెండవ మ్యాచ్ లో సెంచరీ తో( Rohith Sharma Century) రెచ్చిపోయాడు.
తాజాగా జరిగిన పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా అదే ఫుల్ ఫామ్ కొనసాగించాడు.
తాజాగా జరిగిన పాకిస్తాన్ మ్యాచ్లో భారత జట్టు ఓపెనర్ గిల్ తో పాటు రోహిత్ శర్మ వరుస ఫోర్లు, సిక్సర్లతో అద్భుత ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.
ఒకపక్క రోహిత్ బౌండరీలు కొడుతుంటే.ప్రేక్షకుల సందడితో స్టేడియం దద్దరిల్లింది.
"""/" /
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో ఎలాంటి ఆటను ప్రదర్శించాడో.భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో( Ind Vs Pak Match ) కూడా అలాంటి అద్భుత ఆటనే ప్రదర్శించాడు.
అయితే ఈ మ్యాచ్ లో సెంచరీ మిస్ చేసుకున్నాడు.6 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 86 పరుగులు చేసిన రోహిత్ శర్మ, షాహీన్ ఆఫ్రీది బౌలింగ్ లో పెవీలియన్ చేరాడు.
ఈ మ్యాచ్లో మూడు సిక్సర్లు పూర్తి చేయడంతో వన్డేల్లో 300 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్ గా.
అంతర్జాతీయ మూడో బ్యాటర్ గా నిలిచాడు. """/" /
అంతర్జాతీయ క్రికెట్లో వన్డేలలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా పాకిస్తాన్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది( Shahid Afridi ) 351 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
వెస్టిండీస్ మాజీ దిగ్గజం లెజెండరీ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్( Chris Gayle ) 331 సిక్సర్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 303 సిక్సర్లతో ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు.
ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో రోహిత్ శర్మ ఫామ్ చూస్తుంటే.మరెన్నో సరికొత్త రికార్డులు తప్పక క్రియేట్ అవుతాయని తెలుస్తోంది.
రజనీకాంత్ పాటకి అదిరిపోయే డ్యాన్స్ చేసిన చిలుక.. వీడియో వైరల్..