భారత్- ఆస్ట్రేలియా తొలి వన్డే కు రోహిత్ శర్మ దూరం.. తొలి వన్డే కు కెప్టెన్, ఓపెనర్ ఎవరంటే..!

2023లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

భారత్- ఆస్ట్రేలియా( India- Australia ) మధ్య మూడు వన్డే ల సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ముంబై వేదికగా మార్చి 17 వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు తొలి వన్డే ప్రారంభం కానుంది.

ఇరుజట్లు సిరీస్ గెలిచేందుకు సిద్ధంగా ఉన్నాయి.ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, తన తల్లి మరణంతో భారత్ లో జరిగే మూడు వన్డే మ్యాచ్లకు దూరమయ్యాడు.

స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ సారథ్యంలో ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగనుంది.ఇక భారత జట్టు విషయానికి వస్తే కెప్టెన్ రోహిత్ శర్మ ( Captain Rohit Sharma )వ్యక్తిగత కారణాలవల్ల తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు.

అందుకోసం బీసీసీఐ అనుమతి కూడా పొందాడు. """/" / ఇక వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా( Captain Hardik Pandya ) సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది.

రోహిత్ శర్మ తొలి వన్డేలో లేకపోవడంతో ఇషన్ కిషన్ మరియు శుబ్ మన్ గిల్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేయనున్నారు.

గిల్ సూపర్ ఫామ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఇషాన్ కిషన్( Ishan Kishan ) బంగ్లాదేశ్ పై డబల్ సెంచరీ చేశాక, తర్వాత అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

తన సత్తా ఏంటో చూపించడానికి సిద్ధమవుతున్నాడు.ఇక శ్రేయస్ అయ్యర్ కు గాయం కారణంగా సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) కు స్థానం దక్కింది.

చాహల్ బెంచ్ కే పరిమితం అవుతూ, ఆ స్థానంలో కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతున్నాడు.

ఇక వైజాగ్ వేదికగా జరిగే రెండో వన్డే టెస్ట్ కు తిరిగి జట్టులో చేరనున్నాడు రోహిత్ శర్మ.

తొలి వన్డేలో భారత జట్టులో ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్/ ఉమ్రాన్ మాలిక్ లు బరిలోకి దిగుతున్నట్లు సమాచారం.

థియేటర్లలో ఫ్లాపైనా అక్కడ మాత్రం హిట్.. విశ్వక్ సేన్ సెలక్షన్ కు తిరుగులేదుగా!