బుమ్రాకు కౌంటర్ వేసిన రోహిత్ భార్య

టీమిండియా క్రికెటర్ ,ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.

ఇక తనికి సంబంధించిన ప్రతీ విషయాన్ని బుమ్రా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటారు.

తాజాగా జస్ప్రీత్ బుమ్రా అహ్మదాబాద్ నుంచి ముంబయికి రోడ్డు మార్గంలో బయలుదేరాడు.కోవిడ్ ప్రస్తుతం విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చెప్పిన అన్ని సూచనలను పాటిస్తూ తాను ప్రయాణం చేస్తున్నాననే విషయాన్ని స్వయంగా బుమ్రా ఇంస్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

ఈ పోస్ట్ పై ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.ఇక తాజాగా ఈ పోస్ట్ పై రోహిత్ భార్య కూడా స్పందించారు.

ఇప్పుడు ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ఇంతకీ రోహిత్ భార్య రితిక ఈ పోస్ట్ పై చేసిన ఆసక్తికర కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

హ్హహ్హ.ఓకే నీ మాస్క్ వెనక ఉన్న చిరునవ్వుతోనే మేము కలిసి పనిచేయబోతున్నాం' అని రితిక కామెంట్ చేసింది.

ప్రస్తుతం రితిక ఈ పోస్ట్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

యూఏఈ లో వచ్చే నెల 19వ తేదీన మొదలు కానున్న ఐపీఎల్ కు తమ ప్లేయర్స్ తో కలిసి ఫ్రాంచైజీలు ఈవారం బయలుదేరుతున్నాయి.

భారతీయ విద్యకు గ్లోబల్ డిమాండ్.. ఆన్‌లైన్ స్కూల్స్‌తో కనెక్ట్ అవుతోన్న ఎన్ఆర్ఐ విద్యార్ధులు