దగ్గుకు చెక్ పెట్టే పటిక బెల్లం..ఎలా వాడాలంటే?
TeluguStop.com
దగ్గు మొదలైందంటే ఓ పట్టాన పోదు.ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, వాతావరణం మార్పులు, ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్య ఏర్పడటం, దుమ్ము, ధూళి, సిగరెట్ పొగ ఇలా రకరకాల కారణాల వల్ల దుగ్గు ఏర్పడుతుంది.
ఇక ఈ దగ్గును తగ్గించుకునేందుకు ఎన్నో మందులు వాడతారు.రకరకాల టానిక్స్ తీసుకుంటారు.
కానీ, న్యాచురల్‌గా కూడా దగ్గును చెక్ పెట్టవచ్చు.ముఖ్యంగా పటిక బెల్లం దగ్గుకు చెక్ పెట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
మరి పటిక బెల్లంను ఎలా యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ పటిక బెల్లం పొడి, పావు స్పూన్ మిర్యాల పొడి మరియు గోరు వెచ్చని నీరు పోసి బాగా కలిపి తీసుకోవాలి.
ఇలా ఉదయం, సాయంత్రం చేస్తే పటిక బెల్లంలో ఉండే ఔషధ గుణాలు దగ్గు నుంచి తక్షణ ఉపశమనం ఇస్తాయి.
"""/"/
అలాగే దగ్గు కారణంగా కొందరికి గొంతు బొంగురు పోతుంటుంది.అలాంటి సమయంలో వేడివేడి పాలల్లో పటికబెల్లం పొడి మరియు చిటికెడు పసుపు కలిపి తీసుకోవాలి.
ఇలా ఉదయం లేదా రాత్రి నిద్రించే ముందు తీసుకుంటే గొంతు బొంగురు తగ్గు ముకం పడుతుంది.
దగ్గు మాత్రమే కాదు గొంతు నొప్పిని కూడా పటిక బెల్లం నివారించగలదు.ఒక స్పూన్ పటిక బెల్లం పొడి తీసుకుని.
అందులో పుదీనా ఆకుల రసం కలిపి తీసుకోవాలి.ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు చేస్తే గొంతు నొప్పి దూరం అవుతుంది.
ఇక నోటి పూత సమస్యకు చెక్ పెట్టడంలోనూ పటిక బెల్లం ఉపయోగపడుతుంది.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తీసుకుని అందులో పటిక బెల్లం పొడి మరియు యాలకుల పొడి వేసి బాగా కలిపి సేవించాలి.
ఇలా రోజుకు ఒక సారి చేస్తే నోటి పూత సమస్య త్వరగా తగ్గు ముఖం పడుతుంది.
కేటీఆర్ కు అంత శక్తి ఉందా ? జగ్గారెడ్డి కౌంటర్