నవ్వించాలని కంకణం కట్టుకొని తీసిన సినిమా ఎఫ్3.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్
TeluguStop.com
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'.
డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఎఫ్3 ' ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి.
ఎఫ్3 సెన్సార్ పూర్తయింది.సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది.
సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే వున్నారు.ఎఫ్ 2తర్వాత ఇంత హాయిగా నవ్వుకున్న సినిమా ఎఫ్ 3అనే అని సెన్సార్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న నేపధ్యంలో చిత్ర సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో ఎఫ్ 3 విశేషాలు పంచుకున్నారు.
ఆయన పంచుకున్న ఎఫ్ 3 విశేషాలివి.h3 Class=subheader-styleఎఫ్3 ఎంత ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది?/h3p
సినిమా అంతా నవ్వుతూనే వుంటారు, ఇది మాత్రం గ్యారెంటీ.
అనిల్ రావిపూడి చాలా అద్భుతంగా రాశారు, తీశారు.ఆర్ఆర్ చేస్తూ పడిపడి నవ్వుకున్నాను.
నవ్వినవ్వి పొట్ట చెక్కలైపోద్ది.అంత హెలిరియస్ గా వుంది ఎఫ్ 3.
ఈ సినిమాని నవ్వించాలానే కంకణం కట్టుకొని తీసినట్లుగా అనిపించింది.జంధ్యాల, ఈవీవీ గారు ఎంత చక్కగా హాస్యం పండించేవారో .
అలాంటి ఆరోగ్యకరమైన హాస్యం ఎఫ్ 3లో వుంది.అన్ని వర్గాల ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు.
ఇందులో ఎంటర్ టైన్మెంట్ తో పాటు సందేశం కూడా వుంటుంది.ఆ సందేశం కూడా చాలా గొప్ప వుంటుంది.
వెంకటేష్ గారు అద్భుతంగా చేశారు.ఆయన ఈ సినిమాలో చాలా ముద్దుగా వున్నారు.
వరుణ్ తేజ్ కూడా వండర్ ఫుల్ గా చేశారు.తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్, సునీల్, అలీ .
ఇలా అందరూ హిలేరియస్ గా చేశారు.ఎఫ్ 2కి మించిన వినోదం ఎఫ్ 3లో వుంటుంది.
"""/"/
H3 Class=subheader-styleఎఫ్ 2 లో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు.ఎఫ్ 3 పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.
ఒత్తిడి ఫీలయ్యారా?/h3p
దర్శకుడు అనిల్ రావిపూడి గారితో పని చేస్తే ఒత్తిడి వుండదు.ఆయన స్క్రిప్ట్ చెప్పినపుడే సినిమా చూసినట్లు వుంటుంది.
వెంకటేష్ గారి పాత్ర గురించి చెప్పినపుడు ఆయనలానే యాక్ట్ చేశారు.వరుణ్ తేజ్ పాత్ర చెప్పినపుడు వరుణ్ లా చేస్తారు.
చివరికి హీరోయిన్ పాత్రలు కూడా నటించేస్తారు, నిజానికి అనిల్ లో గొప్ప నటుడు వున్నారు.
ఆయన అంత చక్కగా నటించి చెప్పడం వలన సినిమా టైమింగ్ తెలిసిపోతుంది.అలాగే ఆయన చాలా ఫాస్ట్ గా సినిమా తీస్తారు.
ఎఫ్ 2 విషయానికి వస్తే ఎక్కువ సిట్యుయేషనల్ సాంగ్స్.ఎఫ్ 3లో సిట్యుయేషనల్ గానే కాకుండా జనరల్ గా కనెక్ట్ అయ్యే సాంగ్స్ చేశాం.
లబ్ డబ్ డబ్బు, లైఫ్ అంటే ఇట్లా వుండాలా పాటలు కథలో భాగం అవుతూనే అందరికీ కనెక్ట్ అయ్యేలా వుంటాయి.
H3 Class=subheader-styleఎఫ్ 3 ఆల్బమ్ సూపర్ హిట్ అయ్యింది.మీరు అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్ ?/h3p
లబ్ డబ్ డబ్బు కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఉ ఆహా.లైఫ్ అంటే ఇట్లా వుండాలా.
పాటలు కూడా డిఫరెంట్ గా ఉంటూ చాలా కొత్తగా వున్నాయని ఆడియన్స్ ఫీలయ్యారు.
అన్నిటికంటే దర్శకుడు అనిల్ రావిపూడి గారు సినిమా రీరికార్డింగ్ అంతా చూసి.అద్భుతంగా చేశారు.
మీకు వంద హగ్గులు వంద ముద్దులు'' అన్నారు.దర్శకుడు ఆ మాట చెప్పడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
"""/"/
H3 Class=subheader-styleనిర్మాత దిల్ రాజు గారిది మీది చార్ట్ బస్టర్ కాంబినేషన్ .
దాదాపు అన్నీ సూపర్ హిట్స్.దిల్ రాజు గారితో మీ ప్రయాణం ఎలా వుంటుంది ?/h3p
దిల్ రాజు గారితో నాది ఒక నిర్మాత - సంగీత దర్శకుడి అనుబంధం అనే కంటే ఒక కుటుంబం అనొచ్చు.
ఆయనతో నాకు నచ్చేది సినిమా పట్ల ప్యాషన్.ఆయన చూడని సక్సెస్ లేదు.
కానీ ప్రతి సినిమా ఆయన ఫస్ట్ మూవీలానే ఎక్సయిట్ అవుతారు.ఆయన ప్రొడక్షన్ లో చేసే ప్రతి సినిమాకి సంబధించి మ్యూజిక్ గురించి నాతో మాట్లాడుతుంటారు.
నా అభిప్రాయం అడుగుతారు.నా జడ్జ్మెంట్ పట్ల ఆయనకి మంచి నమ్మకం.
మేము సినిమా గురించే మాట్లాడుకుంటాం.సినిమా బావుంటే అది ఎవరిదైనా మెచ్చుకునే గుణం మా ఇద్దరిలో వుంది.
సినిమా పట్ల మా ఇద్దరికి వున్న ప్యాషనే మంచి విజయాలకి కారణమని భావిస్తా.
H3 Class=subheader-styleమెలోడి కంటే ఐటెం సాంగ్ కంపోజ్ చేయడం కష్టం కదా.ఎఫ్ 3లో 'లైఫ్ అంటే ఇట్లా వుండాలా'' స్పెషల్ కూడా సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.
స్పెషల్, ఐటెం సాంగ్స్ లో మీరు ఎప్పుడూ సక్సెస్ సాధిస్తారు.మీ సక్సెస్ సీక్రెట్ ఏమిటి ?/h3p
మెలోడి, ఐటెం సాంగ్స్ కి ఒక తేడా వుంది.
మెలోడి కి ఒక బేస్ వుంటుంది.సన్నివేశం, కథ ఇలా ఎదో ఒక ఆధారం వుంటుంది.
కానీ ఐటెం సాంగ్ వినోదం కోసమే ప్రత్యేకంగా వుంటుంది.దీనికి ఒక రూలు కూడా వుండదు.
ఎప్పుడైతే రూలు వుండదో ఆప్షన్స్ పెరిగిపోతాయి.దేన్నీ ఆధారంగా చేసుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచన వస్తుంది.
ఐతే నా వరకూ ఒక కంపోజర్ గా కంటే మ్యూజిక్ లవర్ గానే ఉంటా.
ముందు మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తాను.ఒక ట్యూన్ కంపోజ్ చేసి దీనికి నేను డ్యాన్స్ చేస్తానా లేదా ని చూసుకుంటా.
ట్యూన్ కంపోజ్ చేసినప్పుడే నాకు ఒక ఊపు వచ్చిందంటే అందరికీ ఆ జోష్ వస్తుందని నమ్ముతా.
బహుశా అదే సీక్రెట్ కావచ్చు. """/"/
H3 Class=subheader-styleఇండస్ట్రీ లో మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య ఎలాంటి పోటీ వుంటుంది ?/h3p
పోటీ వుండదండీ.
మంచి ప్రోడక్ట్ వచ్చినపుడు దానిని చూసి ప్రేరణ పొందుతాం.అలాంటి పాట మనమూ చేస్తే బావుంటుందనిపిస్తుంది.
అంతేకానీ కాంపిటేషన్ ఏమీ వుండదు.h3 Class=subheader-styleరౌడీ బాయ్స్ గుడ్ లక్ సఖీ, ఆడవాళ్ళూ మీకు జోహార్లు మ్యూజిక్ బావుంటుంది కానీ సినిమా సరిగ్గా రీచ్ కాలేదు.
ఇలాంటి పరిస్థితి ఎలా తీసుకుంటారు ?/h3p
రౌడీ బాయ్స్ నా ఫేవరేట్ ఆల్బమ్.కానీ సడన్ గా రిలీజ్ చేయాల్సి వచ్చింది.
గుడ్ లక్ సఖీ, ఆడవాళ్ళూ మీకు జోహార్లు నాకు నచ్చిన ఆల్బమ్స్.
కానీ మేము అనుకున్నంత రీచ్ కాలేదు.అయితే మ్యూజిక్ చేస్తున్న ప్రోగ్రస్ ని బాగా ఎంజాయ్ చేస్తాం.
అది రీచ్ ఐతే ఇంకా హ్యాపీ.ఐతే కొన్ని సార్లు మనం ఊహించినదాని కంటే పెద్ద సక్సెస్ వస్తుంది.
దీనికి ఊదాహరణ రంగస్థలం.సినిమా తెలుగులో రిలీజ్ చేస్తే నాకు దేశవ్యాప్తంగా పేరొచ్చింది.
నీకళ్ళు నీలి సముద్రం పాట కూడా అలానే సూపర్ హిట్ అయ్యింది.పుష్ప కి పాన్ ఇండియా అప్లాజ్ వచ్చింది.
H3 Class=subheader-styleమ్యూజిక్ గురించి ఎప్పటికీ చెన్నై మీదే ఆధారపడే పరిస్థితి వుంది .
దిన్ని ఎలా చూస్తారు ?/h3p
సంగీతం అనేది జనరల్ థింగ్.ఇది కేవలం సినిమాకి సంబధించినదే కాదు.
ఒకొక్క ప్రాంతంలో నేర్చుకున్నవారి సంఖ్యని బట్టి వుంటుంది.చాలా మంది సంగీతకారులు చెన్నైలో స్థిరపడ్డారు.
అలాగే ఇక్కడ సంగీతాన్ని సాధన చేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ.ఇక్కడ మ్యూజిక్ స్కూల్స్ వున్నాయి.
ఐతే హైదరాబాద్ లో కూడా ఇప్పుడు మ్యూజిక్ స్కూల్స్ పెరుగుతున్నాయి.తల్లితండ్రులు పిల్లలని ఇటువైపు ప్రోత్సహిస్తున్నారు.
H3 Class=subheader-styleసల్మాన్ ఖాన్ తో మళ్ళీ వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది ?/h3p
మాది సూపర్ హిట్ కాంబినేషన్.
అన్నీ సూపర్ హిట్స్ వచ్చాయి.నేను అంటే ఆయనకి చాలా ఇష్టం.
ఇండియనే మొగుడుగా కావాలంట.. ఈ అమెరికన్ మహిళ వీడియో చూస్తే..