శుక్రవారం రోజున రాళ్ల ఉప్పు దానం చేస్తే ఏం అవుతుందో తెలుసా?

శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు.భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.

శుక్రవారం రోజున మాసిన బట్టలను, ముతక బట్టలను ధరించడం వల్ల అరిష్టమని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

శుక్రవారం రాళ్ల ఉప్పు తో ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

ఉప్పుతో ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.శుక్రవారం రోజున అమ్మవారికి పూజ చేసి రాళ్ల ఉప్పు కుప్పగా పోసి అందులో దీపం వెలిగించడం ద్వారా ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

అలాగే శుక్రవారం రోజున ఉప్పును ఎవరికి దానమివ్వకూడదు.అలా ఇవ్వడం ద్వారా స్వయంగా మనమే మన ఇంటి నుంచి లక్ష్మిని బయటకు పంపించినట్లు.

శుక్రవారం రోజున ఉప్పును కొనడం వల్ల ధనలాభం కలుగుతుంది.శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నగలను తాకట్టు పెట్టకూడదు.

కావాలంటే నగలను కొనవచ్చు.అలాగే మగవారు గడ్డం గీయడం, జుట్టు కత్తిరించడం వంటివి చేయకూడదు.

అలా చేయడం ద్వారా అష్టదరిద్రాలు మన ఇంట్లోనే తిష్ట వేస్తాయి.శుక్రవారం మహిళలు నుదుటిన బొట్టు లేకుండా ఉండకూడదు నలుపు రంగు బొట్టు, గాజులు, దుస్తులను కూడా ధరించకూడదు.

"""/"/ శుక్రవారం మహిళలు ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేయడం మంచిది.శుక్రవారం రావిచెట్టును తాకకూడదు, రావి ఆకులను తుంచకూడదు.

తులసి కోటకు పూజ చేయడం చాలా మంచిది తులసి కోటకు నీరు పోసి పూజ చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు.

శుక్రవారం మగవారు తలస్నానం చేయకూడదు.జుట్టు కత్తిరించి రాదు జుట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి గా భావిస్తూ ఉంటారు కనుక జుట్టు కత్తిరించడం ద్వారా అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

విలువైన వస్తువులను తాకట్టు పెట్టడం కానీ అమ్మడం కానీ చెయ్యకూడదు.మహిళలు ముఖ్యంగా గాజులు, కుంకుమ కొనరాదు.

శుక్రవారం ఎక్కువగా ఎరుపు రంగు పువ్వులు, ఎరుపు రంగు దుస్తులను ధరించి అమ్మవారిని పూజించడం ద్వారా శుభం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Sajjala Ramakrishna Reddy : చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు..: సజ్జల