సినిమా కథలు రాయనున్న రోబోలు.. వీటి క్రియేటివిటీ లెవెల్స్ తెలిస్తే..!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం అత్యంత అధునాతనంగా మారిపోయింది.

ఏఐ టెక్నాలజీతో గ్యాడ్జెట్లు మరింత స్మార్ట్‌గా పని చేయగలుగుతున్నాయి.యూజర్ల ప్రవర్తన, అలవాట్లకు అనుగుణంగా గ్యాడ్జెట్లు సూచనలు ఇస్తున్నాయంటే దాని వెనక ఏఐ ముఖ్య పాత్ర పోషిస్తోందని చెప్పవచ్చు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అన్ని రంగాలలోనూ అడ్వాన్స్డ్ సేవలను అందిస్తోంది.అయితే ఇప్పుడు ఇది సినిమా రంగంలో కూడా అడుగు పెట్టడానికి రెడీ అవుతోంది.

"""/" / ఏఐ-బేస్డ్ ఆటోమేటిక్‌ స్క్రిప్ట్‌ రైటింగ్‌ టూల్‌ సిద్ధం చేసేందుకు తాజాగా ఈరోస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఐఐటీ బాంబే పని చేయడం మొదలు పెట్టింది.

చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రూపొందిస్తున్న ఈ స్క్రిప్ట్‌ రైటింగ్‌ టూల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు.

సినిమా స్క్రిప్ట్‌ రాయడంలోనూ దర్శకులకు, కథా రచయితలకు ఈ టూల్‌ హెల్ప్ అవుతుందని పేర్కొంటున్నారు.

మరి ఇవి క్రియేటివ్ గా ఆలోచించి సినిమాకి తగిన స్క్రిప్టు రాయగలవా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

"""/" / ఈ టూల్ పని చేయాలంటే స్క్రిప్టు రాసేవారు ముందుగా కంప్యూటర్‌కు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అందించాల్సి ఉంటుంది.

ఏదైనా కథ రాసి ఉంటే ఆ కథలోని మెయిన్ పాయింట్స్ చెబితే కంప్యూటర్ ఆ పాయింట్స్‌ ఆధారంగా ఒక స్టోరీ క్రియేట్ చేస్తుంది.

ఆ స్టోరీతో సీన్స్ ఇలా ఉంటే బాగుంటుందని అని కూడా చెబుతున్నారు.ఇదే అందుబాటులోకి వస్తే రోబోలు రాసిన కథలతోనే మూవీలు తెరకెక్కుతున్నాయి.

ఇది ఒక సంచలనంగా పారుతుందని చెప్పొచ్చు.మరి ఈ రోబో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలిక.

Chandrababu : మదనపల్లి ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!