శంషాబాద్ లో దోపిడీ దొంగల బీభత్సం
TeluguStop.com
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.ఒక వాహనాన్ని ఆపిన దుండగులు కత్తులతో బెదిరించి రూ.
లక్షా యాభై వేలు ఎత్తుకెళ్లారు.స్కూటీపై వచ్చిన ముగ్గురు దుండగులు దొపిడీకి పాల్పడ్డారని తెలుస్తోంది.
ఈ ఘటన వనపర్తి నుంచి హైదరాబాద్ వస్తుండగా శంషాబాద్ మండలంలోని గొల్లూరు ఎక్స్ రోడ్ వద్ద చోటు చేసుకుంది.
డ్రైవర్ రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్14, శనివారం 2024