అమెరికాలో భారత ఎన్నారై నగల షాపులో భారీ చోరీ...!!

అగ్ర రాజ్యం అమెరికాలో తుపాకీ రాజ్యమేలుతోంది అని చెప్పడానికి గడిచిన కొన్ని రోజులుగా ఎన్నో సంఘటనలు మనకు సాక్ష్యాలుగా నిలిచాయి.

పిల్లలపై , టీనేజర్లపై వృద్దులపై ఇలా ఎంతో మంది గడిచిన కొన్ని నెలల కాలంలో బలై పోయారు.

కొందరు దుండగులు ఆర్ధిక భారంతో దోపిడీలు చేసే నేపధ్యంలో కాల్పులు జరుపగా మరికొందరు డ్రగ్స్ కు బానిసలుగా మారి మానసిక సమస్యల కారణంగా కాల్పులకు తెగబడుతున్నారు.

కాగా మరికొందరు దుండగులు కేవలం భారతీయులే టార్గెట్ గా దాడులు చేస్తున్నారు.గతంలో భారతీయ రెస్టారెంట్స్ పై, పలు వ్యాపారాలపై దాడులు చేసి దోచుకోగా కొంత కాలంగా ఇలాంటి దాడులు లేవని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో తాజాగా అమెరికాలోని ఓ భారతీయ ఎన్నారై నగల దుకాణంలో భారీ చోరి జరగడంతో మరో సారి భారత ఎన్నారైలు ఉలిక్కిపడాల్సి వచ్చింది.

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో మిడిల్ సెక్స్ కౌంటీ లో ఉన్న ఓక్ ట్రీ రోడ్డులో ఉన్న భారతీయుడు నగల దుకాణం అంటే ఎంతో ప్రఖ్యాతి గాంచింది.

ఎంతో మంది అమెరికన్స్, భారత ఎన్నారైలు ఈ దుకాణం లో నగలు కొనుగోలుకు వస్తుంటారు.

ఈ క్రమంలోనే నిన్నటి రోజున సినీ ఫక్కీలో సుమారు 10 మంది గుర్తు తెలియని దుండగులు నగల దుకాణంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు.

దుండగులు ప్రవేశించిన సమయంలో దుకాణంలో పనిచేసే సిబ్బందితో పాటు యజమాని, కస్టమర్లు కూడా ఉన్నారని వారిని తుపాకులతో బెదిరించి విలువైన నగలు దోచుకుపోయారని పోలీసులు తెలిపారు.

సిబ్బందిని గన్స్ తో బెదిరించి నగలు తీసుకుపోతూ గాలిలోకి కాల్పులు కూడా జరిపారని దుకాణ యజమాని పోలీసులకు తెలిపారు.

షాపులో ఉన్న సిసి టీవీ పుటేజ్ ను పరిశీలించినా దుండగుల ఆచూకీ ఏ మాత్రం తెలియలేదని వారు పూర్తిగా కప్పబడిన మాస్క్ లను ధరించారని తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

బెన్ ఫిట్ షోలు వేయకపోవడం వల్ల ఎవ్వరికి ఎక్కువ నష్టం జరగబోతుంది..?