గరిడేపల్లిలో దొంగల బీభత్సం

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి రెండిళ్లలో దొంగలు పడి భీభత్సం సృష్టించారు.

బాధితులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.గ్రామానికి చెందిన ఖాజా మొయినుద్దీన్ ఇంట్లో పడ్డ దొంగలు ఐదు తులాల బంగారం,రామచంద్ర అనే వ్యక్తి ఇంట్లో రెండు లక్షల నగదు,తులం వెండిని దొంగలించిన విషయం వెలుగులోకి వచ్చింది.

రెండిళ్లలో కుటుంబసభ్యులు ఊర్లకు పోయిన సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది.తిరిగొచ్చి చూసే సరికి బీరువా తాళాలు పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగిందని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్ఐ సైదులు తెలిపారు.

అయితే గత కొంతకాలంగా గరిడేపల్లి మండలంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు.

గ్రామాలలో ఇంటికి వేసిన తాళాలను చూసి టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్నారు.అంతేకాకుండా రైతులు సాగు చేసే మోటర్లు,వైర్లను కూడా దొంగలిస్తున్నారని రైతులు తెలుపుతున్నారు.

గరిడేపల్లి మండలంలో విచ్చలవిడిగా దొంగతనాలు జరుగుతున్నా అరికట్టడంలో గరిడేపల్లి పోలీసులు అరికట్టడంలో విఫలమవుతున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దొంగతనం జరిగిన తర్వాత వచ్చి ఏమి జరిగిందని అడగటం తప్ప పోలీసులు చేసిందేమీ లేదని ప్రజలు అంటున్నారు.

పోలీసులు నైట్ పెట్రోలింగ్ చేస్తున్నామంటున్నారని, పెట్రోలింగ్ చేస్తే ఇలా దొంగతనాలు జరుగుతాయా అని వాపోతున్నారు.

నిన్ను చాలా మిస్ అవుతున్నా… ఎమోషనల్ పోస్ట్ చేసిన రష్మిక.. ఏమైందంటే?