న్యూజిలాండ్‌లో ఇండియన్ కమ్యూనిటీ లక్ష్యంగా నేరాలు... డెయిరీ స్టోర్‌లో దొంగల హల్‌చల్
TeluguStop.com
ప్రశాంతతకు మారుపేరుగా, సురక్షిత దేశంగా వున్న న్యూజిలాండ్‌లో ఇటీవల నేరాలు పెరుగుతున్నాయి.ముఖ్యంగా ఇండియన్ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని కొందరు నేరాలకు పాల్పడుతున్నారు.
తాజాగా భారత సంతతికి చెందిన డెయిరీ యజమాని దుకాణాన్ని దొంగల ముఠా లక్ష్యంగా చేసుకుంది.
అక్లాండ్‌లోని మెల్రోస్ రోడ్‌లోని అజిత్ పటేల్‌కు చెందిన డెయిరీలోకి ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు బేస్‌బాల్ బ్యాట్‌లతో ప్రవేశించారు.
అయితే ఏం దోపిడి చేశారన్నది తెలియాల్సి వుంది.అక్లాండ్, వైకాటో ప్రాంతాల్లోని ఆరు దుకాణాలలో పటేల్ దుకాణం కూడా ఒకటి.
దోపిడి ఘటనపై పోలీస్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.నేరస్థులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల హామిల్టన్‌లో భారత సంతతికే చెందిన పునీత్ సింగ్ మిల్క్ డైరీలోకి నలుగురు వ్యక్తులు ప్రవేశించి .
దుకాణంలో పనిచేస్తున్న ఉద్యోగిని కొడవళ్లతో నరికి చంపిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడంతో న్యూజిలాండ్‌లోని భారతీయులు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"""/"/
ఈ ఘటనల నేపథ్యంలో మౌంట్ ఆల్బర్ట్‌లోని ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ ఎన్నికల కార్యాలయం ముందు ఇండియన్ కమ్యూనిటీ నిరసనలకు దిగింది.
న్యూజిలాండ్‌లోని చాలా మంది డైరీ యజమానులు, అందులోని కార్మికులు భారత సంతతికి చెందినవారే.
పునీత్ డైరీలో హత్య ఘటన తర్వాత వీరంతా విధులకు హాజరు కావడానికి భయపడుతున్నారు.
అయితే ఈ ప్రాంతంలో భద్రతా చర్యలపై స్థానికులు పెదవి విరుస్తున్నారు.ఈ ఏరియాలో కమ్యూనిటీ కానిస్టేబుళ్లు లేరని చెబుతున్నారు.
గతంలో స్థానిక వ్యాపారులు తలో చేయ్యి వేసి రాత్రిపూట సెక్యూరిటీ గార్డును నియమించుకోవాలని భావించారు.
అయితే నిధుల కొరత కారణంగా ఇది కార్యరూపం దాల్చలేదు.
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ ను పోగొట్టే మోస్ట్ పవర్ ఫుల్ ఇంటి చిట్కాలు ఇవే!