న్యూజిలాండ్‌: భారతీయుడి దుకాణంలో దొంగల బీభత్సం.. బిక్కుబిక్కుమంటోన్న ఇండియన్ కమ్యూనిటీ

ప్రశాంతతకు మారుపేరుగా, సురక్షిత దేశంగా వున్న న్యూజిలాండ్‌లో ఇటీవల నేరాలు పెరుగుతున్నాయి.ముఖ్యంగా ఇండియన్ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని కొందరు నేరాలకు పాల్పడుతున్నారు.

తాజాగా భారత సంతతికి చెందిన డెయిరీ యజమాని దుకాణాన్ని దొంగల ముఠా లక్ష్యంగా చేసుకుంది.

లోపల వుంచిన సిగరెట్లు, నగదును వారు అపహరించుకుపోయారు.కౌరీలాండ్స్‌లో ఈ ఘటన జరిగింది.

బాధితుడు ఉరేష్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.తాను సోమవారం దుకాణం వెనుక భాగంలో వున్నానని, ఈ క్రమంలో దుండగులు లోనికి చొరబడి దాడికి పాల్పడినట్లు చెప్పాడు.

అనంతరం కౌంటర్‌లో వున్న సిగరెట్లను దొంగిలించారని ఆవేదన వ్యక్తం చేశాడు.తన ముగ్గురు పిల్లలు లోనికి వచ్చి కౌంటర్‌లోని నగదు రిజిస్టర్‌ను గట్టిగా పట్టుకున్నారని పటేల్ తెలిపారు.

తన భార్య, కుమార్తె అరుపులు విన్న తాను.పరిగెత్తుకుంటూ లోనికి వచ్చి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించానని, కానీ వారు తనపై దాడి చేసి పారిపోయారని ఉరేష్ పటేల్ చెప్పాడు.

"""/" / అయితే దుండగుల్లో ఇద్దరిని గ్లెన్ ఈడెన్‌లో, మరొకరిని ఓ దుకాణంలో జనం పట్టుకున్నారని పోలీసులు తెలిపారు.

మరోవైపు.దొంగతనం జరగడంతో అప్పటికే తాము తీవ్ర దిగ్భ్రాంతిలో వుండగా.

పోలీసులు వచ్చి తమను నేరస్థుల మాదిరిగా విచారించారని పటేల్ భార్య మనీషా ఆవేదన వ్యక్తం చేశారు.

గతేడాది డిసెంబర్‌లో భారత సంతతికి చెందిన జనక్ పటేల్ తాను పనిచేస్తున్న చోటే దొంగల చేతిలో హత్యకు గురయ్యారని.

ఆ తర్వాత కూడా ఇక్కడ పరిస్ధితులు ఏమీ మారలేదని ఆమె ఆరోపించారు.ఇకపోతే.

అదే నెలలో అక్లాండ్‌లోని మెల్రోస్ రోడ్‌లోని అజిత్ పటేల్‌ అనే భారత సంతతికి చెందిన వ్యక్తి డెయిరీలోకి ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు బేస్‌బాల్ బ్యాట్‌లతో ప్రవేశించిన ఘటన కలకలం రేపింది.

"""/" / ఈ ఘటనల నేపథ్యంలో మౌంట్ ఆల్బర్ట్‌లోని అప్పటి ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ ఎన్నికల కార్యాలయం ముందు ఇండియన్ కమ్యూనిటీ నిరసనలకు దిగింది.

న్యూజిలాండ్‌లోని చాలా మంది డైరీ యజమానులు, అందులోని కార్మికులు భారత సంతతికి చెందినవారే.

జనక్ హత్య ఘటన తర్వాత వీరంతా విధులకు హాజరు కావడానికి భయపడుతున్నారు.అయితే ఈ ప్రాంతంలో భద్రతా చర్యలపై స్థానికులు పెదవి విరుస్తున్నారు.

ఈ ఏరియాలో కమ్యూనిటీ కానిస్టేబుళ్లు లేరని చెబుతున్నారు.గతంలో స్థానిక వ్యాపారులు తలో చేయ్యి వేసి రాత్రిపూట సెక్యూరిటీ గార్డును నియమించుకోవాలని భావించారు.

అయితే నిధుల కొరత కారణంగా ఇది కార్యరూపం దాల్చలేదు.

గేమ్ ఛేంజర్ లో ఆ ఒక్క పాట చూస్తే చాలు టికెట్ డబ్బులు వెనక్కి వచ్చినట్టే: ఎస్ జె సూర్య