మునుగోడు నియోజకవర్గం, నాంపల్లి మండల కేంద్రం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో….

15 రోజుల నుండి ఎవరు ఏం చెప్పారో అన్ని విన్నరు.మనకు అన్నం పెట్టినోడుఎవరో.

సున్నం పెట్టేటోడు ఎవరో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.బీజేపీ బట్టెబాజ్ గాళ్ల మాటలు వింటే గోస పడతరు.

కేసీఆర్ మనుగోడుకు వచ్చిన తర్వాత బీజేపీవాళ్లు జబ్బలు జార విడిచిండ్రు.కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయం మైంది.

ఎంత మందికి ఓట్లు వేసినం.బీజేపీకి,కాంగ్రెస్.

టీడీపీకి ఓట్లువేసినం.కాని గతంలో మంచి నీళ్లు గోస ఎలా ఉండేది.

వాటర్ ట్యాంకర్ నుండి నీళ్లు తెచ్చి మీ భుజాలు కాయలు కాయలేదా.ఇవాళ ఇంటింటికి నీళ్లు ఇచ్చిన కేసీఆర్ ను సాదుకోవాలా.

చంపుకోవాలా.మీరే ఆలోచించండి మా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిండి.

నల్లాల ద్వారా ఇంటింటికి నీళ్లు ఏలా ఇచ్చామే.మీ పొలాలకు కాలువల ద్వారా నీళ్లు ఇస్తం.

బీజేపీ పార్టీతో మాట్లాడుకుని రాజ్ గోపాల్ రెడ్డి 18 వేల కోట్ల కాంట్రాక్టు తెచ్చుకున్నరు.

ఇది స్వయంగా రాజగోపాల్ చెప్పుకున్నరు.ఆరు నెలల కింద నాకు కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు అని.

బీజేపీ వాళ్లను సంతోషపెట్టేందుకు రాజీనామా చేసిండ్రు.మునుగోడ ప్రజలకు ఏ మైనా వచ్చిందా.

కనీసం మహిళలు కూర్చోవడానికి ఓ మహిళా సంఘ భవనం కట్టలే.ఏనాడు మీ దగ్గరకు రాజగోపాల్ రాలే.

దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండితే రావు.మీకు 2000 పెన్షన్ ఇచ్చింది ఎవరు, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు.

24 గంటల ఫ్రీ కరెంటు ఇచ్చింది ఎవరు.రైతు బంధు ఇచ్చింది ఎవరు.

రైతు బీమా ఇచ్చింది ఎవరు.నీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ఇచ్చింది ఎవరు.

అన్ని ఇచ్చింది కేసీఆర్ సార్.బీజేపి ఏం ఇచ్చింది.

బీజేపీ కూడా ఇచ్చింది.400రూపాయల గ్యాస్ బండ ధరను 1200 చేసింది.

రాజగోపాల్ కు 18 వేల కాంట్రాక్ట్ ఇచ్చింది.పెట్రోల్,డిజీల్ ను వంద రూపాయలు తెచ్చిండ్రు.

ఉప్పు, పప్పు నిత్యావసర ధరలు పెంచింది.కంపెనీలు అమ్మింది.

ఎల్.ఐసీ, బ్యాంకులు, రైళ్లు, రైల్వేస్టేషన్.

విమానాలు, ఎయిర్ పోర్టులను అమ్మి మన పిల్లలను రోడ్డు మీదకు తెచ్చిండ్రు.బీజేపీవాళ్లు మీటింగ్ లు పెట్టి మేం ఈ పని చేసినమని చెప్రిండ్రా.

కేసీఆర్ ను తిట్టుడు.జూటా మాటలు.

బట్టే బాజ్ మాటలు తప్ప ఒక్క నిజం లేదు.నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో.

బీజేపీ మాటల్లో నీతి, నిజం అంతే ఉంటది.బీజేపీ మీటర్లు పెట్టి రైతుకు బిల్లు పంపండని అంటోందని అని నేను ఒక మీటింగ్లో చెప్పిన.

తొండి సంజయ్ ఏమన్నడు.మేం ఎక్కడ మీటర్లు పెట్టమని చెప్పినం అన్నడు.

ఉత్తగ చెబుతున్నరు టీఆర్ఎస్ వాళ్లు అన్నరు.ఇది కేంద్ర ఆర్థిక శాఖ ఢిల్లీ నుంచి పంపిన ఉత్తరం ఇది.

బోరు బాయి కాడ మీటర్ పెట్టండి.మీకు ఏడాదికి ఆరువేల కోట్లు ఇస్తమని రాసిన ఉత్తరం ఇది.

బోరు బాయి కాడ మీటర్ పెట్టాలే.బిల్లు మీఇంటికి పంపాలే అని రాసారు.

మీటర్ పెట్టమండరా.వద్దా.

వద్దంటే.3వతేదీన కారు గుర్తుకు కుయి కుయి కుయి అని ఓటు గట్టిగా నొక్కి వేయాలే.

రైతు బందు ఇచ్చిండ్రు.రైతు దురదృష్టవశాత్తు చనిపోతే రైతు బీమా ఇచ్చిండ్రు.

ఆడపిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి లక్షరూపాయలు వస్తలేవా.కేసీఆర్ సారును మర్చిపోదామా.

కోడలు కాన్పుకు పోతే ప్రభుత్వ దవాఖానాకు.కేసీఆర్ కిట్ ఇవ్వడంలేదా.

నెల నెల 2016 పె న్షన్ , పది కేజీల బియ్యం కేసీఆర్ గారు ఇస్తలేరా.

పేదల వృద్దుల ఆత్మగౌరవం పెంచిండు కేసీఆర్.నాలుగేళ్లుగా ఏ ఒక్క పని చేయని రాజ్ గోపాల్ రెడ్డి రేపు ఏట్లా చేస్తాడు.

నిన్నటి దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నవ్.గెలిచే ప్రసక్తే లేదు.

గెలిస్తే బీజేపీ ఎమ్మెల్యే అయితవు తప్ప ఎం చేస్తారు.ఇంక.

18 వేల కోట్ల కాంట్రాక్టు వచ్చింది.డబ్బులు బాగా ఉన్నయి.

బాగానే పంచవచ్చు.కాని అవి ఒక్కరోజు ఇస్తడు.

కాని ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు.రైతు బీమా, మంచినీళ్లు.

పది కేజీల బియ్యం ఇస్తోందికేసీఆర్ గారు.డబుల్ ఇంజన్ సర్కార్ అంటరు.

కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్.వడ్లు కొనమంటే కొనడం చేత కాదు.

కొనలేం అంటే.కేసీఆర్ గారు ప్రతీ గింజ కొన్నడు.

వాళ్లు ఏం అన్నరు.నూకలు బొక్కమని చెప్పిండ్రు.

ఢిల్లీలోని బీజేపీ నేతలు.ఇలా నూకలు బొక్కమని తెలంగాణ రైతులను అవమానించిన బీజేపీ వాళ్ల తోకలు కత్తిరించాలి.

వాళ్లకు మీ ఓటుతో బుద్ధి చెప్పాలి.వానాకాలం వచ్చింది.

మళ్లీ రైతుల వడ్లు కొనుగోలుకు కేసీఆర్ గారు సన్నాహాలు చేస్తున్నరు.డబుల్ ఇంజన్.

డబుల్ ఇంజన్ అంటరు.బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటక ఉంది.

కర్ణాటక కాంట్రాక్టర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీకి ఉత్తరం రాశారు.నేను పని చేసిన దానికి బిల్లు ఇవ్వమంటే బీజేపీ మంత్రులు 40 శాతం కమిషన్లు అడుగుతున్నరు.

నేను ఆత్మహత్య చేసుకొంట, నాకు డబ్బులు లేవు.అప్పులపాలయిన అని బస్వరాజ్ అమర్ గోల్ అనే కాంట్రాక్టర్ ఉత్తరం రాశారు మీ డబుల్ ఇంజన్ సర్కార్ లో ఎస్సై పోస్టులనులక్షలకు అమ్ముకున్నరు.

ఉద్యోగాలు అమ్ముకున్నరు.కాంట్రాక్టర్ల నుండి 40 శాతం కమిషన్లు ఇయ్యమని కాంట్రాక్టర్ల ఉసురు పోసుకుంటున్నరు.

డబుల్ ఇంజన్ సర్కార్ మనల్ని ఆగం చేస్తారు.డబుల్ ఇంజన్ వాళ్లు ఉచితాలు బంద్ చేయాలంట.

బోర బాయి కాడ మీటర్ పెట్టాలంట.ముక్కు పిండి డబ్బులు వసూలు చేయమంటున్నరు.

ఆడ పిల్ల పెళ్లికి ఇచ్చే లక్ష రూపాయలు ఉచితమంట బంద్ చేయమంటున్నరు.ప్రధాని చెబుతున్నరు.

బీజేపీ వాళ్లు చెబుతున్నరు.రైతులు, ఆక్కాచెళ్లెళ్లు ఆలోచించండి.

ఆగం కావద్దు.కాంగ్రెస్ పార్టీ లేనే లేదు.

ఓటు వేస్తే ఖరాబయితది.బీజేపీవాళ్లు పైసా బలంతో గెలుస్తమంటున్నరు.

పైసా బలం గెలవాలా.ప్రజా బలం గెలవాలాఅన్నం పెట్టిన చేయిని మరుస్తమా.

వడ్లు కొనమంటే చేతగాలే.గాని ఎమ్మెల్యేలను కొంటరంట.

దెబ్బ కొడితే బేజేపీ దిమ్మ తిరిగింది.కేసీఆర్ గారిదెబ్బకు బీజేపీ నేతలు ముఖం చాటేసుకున్నరు.

ఒక్క జాతీయ నాయకుడు ఇటు దిక్కు చూడటం లేదు.ఢిల్లీ కేళ్లి వచ్చిన బీజేపీ దూతలను చంచల్ గూడ జైళ్లో ఉన్నరు.

ఢిల్లీ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రుల ఇక ఇటు రావడానికి గజ గజ లాడుతున్నరు.

ఎమ్మెల్యేలను కొంటం.మా దగ్గర పైసలున్నయి.

మాకు ఈడీ ఉంది.ఇన్ కం టాక్స్ ఉందని భయపెట్టిస్తం.

కాంట్రాక్ట్ లిస్తం అన్న అంహంకారం ఉంది.ఢిల్లీ అహంకారం గెలవాలా.

తెలంగాణ ఆత్మగౌరవం గెలవాలా ఆలోచించండి.చావు నోట్లోకి పోయి అన్నం ముద్ద నోట్లో పెట్టకుండా.

తెలంగాణ తీసుకువస్తా అన్నడు.వస్తే జైత్రయాత్ర లేకుంటే నా శవయాత్ర అని బయలెళ్లి తెలంగాణ సాధించిండ్రు కేసీఆర్.

మాకు ఈడీ ఉంది.చట్టాలున్నయి.

అణిచివేస్తం.తెలంగాణనుఆగంచేస్తం.

ఎమ్మెల్యేను కొంటం అని అహంకారంతో బీజేపీ నేతలు ఉన్నరు.తెలంగాణ రాకపోతే రైతు బంధు,రైతు బీమా, 24 గంటల ఉచితవిద్యుత్, కళ్యాణలక్ష్మి వచ్చేదా.

కేసీఆర్ గారు సీఎం కాకపోతే అవ్వలకు 2000 పెన్షన్ వచ్చేదా.తిట్ల పురాణం తప్ప వీళ్లు చేసేదేంటి.

చేనేత పై జీఎస్టీ కోసం చాలా మాట్లాడారు.నేను హైదరాబాద్ లో రుజువులతో సహా అన్ని మాట్లాడితే బండి సంజయ్,కిషన్ రెడ్డి తలకాయ కిందికేసుకున్నరు.

ఒక్కరు మాట్లాడటం లేదు.తెలంగాణ చేనేతపై జీఎస్టీని వ్యతిరేకించిందని చెబితే కిక్కురమంటలేదు.

అక్కా చెళ్లేళ్లు ఇంటి ముందు నల్లాలను చూడండి.వంట రూంలో గ్యాస్ సిలిండర్ చూడండి.

గ్యాస్ సిలిండర్ చూసి కసి కసిగా కారు గుర్తుకు ఓటు గుద్దండి.గ్యాస్ సిలండర్ కు దండం పెట్టండి.

కారు గుర్తుకు ఓటు గుద్దండి.

మీరు సమోసా ప్రియులా.. అయితే ఇకపై తినే ముందు ఇవి తెలుసుకోండి..!