నసర్లపల్లి ఘటనపై రోడ్డు సేఫ్టీ వింగ్ అధికారుల ఆరా…!

నల్లగొండ జిల్లా:చింతపల్లి మండల నసర్లపల్లి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై టిఎస్ రోడ్డు సేఫ్టీ వింగ్ ఎస్పీ రాఘవేందర్ రెడ్డి( Wing SP Raghavender Reddy ) నేతృత్వంలో గురువారం అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఘటన జరిగిన తీరును మరియు అందుకు గల కారణాలను నిశితంగా పరిశీలించారు.ప్రమాద వివరాలను దేవరకొండ డిఎస్పీ గిరిబాబును అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘటనపై టిఎస్ రోడ్డు సేఫ్టీ వింగ్ ఎస్పీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి నల్లగొండ జిల్లా పరిధిలోని మాల్ వెంకటేశ్వర నగర్ నుండి నాగార్జునసాగర్ వరకు 81 కిలోమీటర్లు విస్తరించి ఉన్నట్లు,రాష్ట్ర రహదారిపై ప్రయాణించే వాహనాదారులు తప్పనిసరిగా నిబంధనలను పాటిస్తూ, మూలమలుపులను చూసుకొని జాగ్రత్తగా పయనించాలన్నారు.

ప్రమాదాల నివారణకు ఆర్ అండ్ బీ,పోలీస్ శాఖలు సమన్యాయంతో పని చేయాలని,మైనర్లకు వాహనాలను ఇవ్వొద్దని సూచించారు.

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద ధర్మో ప్లాస్టిక్‌ పెయింట్స్‌,రేడియం స్టెడ్స్‌, వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రోడ్డు సేఫ్టీ డిఎస్పీ వాహెద్,ఏఈ మెహమూద్,నాంపల్లి సర్కిల్ సిఐ నవీన్ కుమార్ ఆర్ &బి డిఈ కాజన్ గౌడ్, ఏడబ్ల్యూఈ షరీఫ్, చింతపల్లి ఎస్ఐ సతీష్ రెడ్డి,తహసిల్దార్ షాంషోద్దీన్,ఆర్ఐ యాదయ్య,ఎస్బీ జానకి రాములు తదితరులు పాల్గొన్నారు.

దేవర రిలీజ్ కు ముందే రికార్డుల మోత.. యంగ్ టైగర్ పేరు మారుమ్రోగుతోందిగా!