వేములవాడ రూరల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో వట్టెంల గ్రామం నుండి ఫాజల్ నగర్ గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ద్వి చక్ర వాహన దారుల కు హెల్మెట్ మీద అవగాహన కల్పించటం జరిగింది అని వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ తెలిపారు.

ఈ కార్యక్రమంను రూరల్ సీఐ శ్రీనివాస్ ప్రారంభించారు ర్యాలీ అనంతరం ద్వి చక్ర వాహనదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతీ ఒక్క వాహన దారుడు రహదారి భద్రత మీద అవగాహన కలిగి ఉండాలి అని, మద్యం తాగి వాహనాలు నడపవద్దు అని, రాంగ్ రూట్ లో వాహనం నడపటం, ట్రిపుల్ రైడింగ్ చేయరాదు అని, రహదారి ప్రమాదాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని మీకోసం మీ కుటుంబం ఎదురుచూస్తుంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ నడపాలి అని కోరారు.

ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, గ్రామస్తులు, వాహనదారులు రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

నేను ధనవంతురాలిని కాదు….నా దగ్గర సహాయం చేసేంత డబ్బు ఉంది: సాయి పల్లవి