ముగ్గు మిల్లుల పొగతో జీవితాలు బుగ్గిపాలు

నల్లగొండ జిల్లా:దామరచర్ల మండలం వాడపల్లి నుండి ఇర్కిగూడెం వెళ్లే ప్రధాన రహదారి వెంట నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన ముగ్గు మిల్లుల నుండి విడుదలయ్యే దుమ్ము ధూళితో ప్రజలు,పశు పక్ష్యాదులు,పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకొని రహదారిపై వెళ్ళే వాహనదారులకు దారి కనపడక అనేక రోడ్డు ప్రమాదాలు జరిగినా,ప్రజలు శ్వాసకోసవ్యాధుల బారిన పడినా,పశువులు అనారోగ్యం పాలైనా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు.

నిబంధనలకు నీళ్ళు వదిలి మిల్లులు యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలుమార్లు సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా మామూళ్ల మత్తులో జోగుతున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు( Pollution Control Board ) తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వెళ్ళిపోతున్నారే తప్పా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ పరిశ్రమకు సున్నపరాయి క్వారీల నుండి ముడిసరుకును ట్రాక్టర్ డోర్ లెవల్ కి మించి ఓవర్ లోడులతో తరలిస్తున్న సమయంలో రహదారిపై పెద్ద పెద్ద రాళ్లు పడి ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యాలకు అలాగే పర్యావరణానికి హాని చేసే ఈ పరిశ్రమలను తక్షణమే సీజ్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.

ఐబ్రోస్ దట్టంగా పెరగాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!