ఆపదలో ఉన్నాం ఆడుకోండి సారూ…!

నల్లగొండ జిల్లా: మునుగోడు మండల పరిధిలోని రత్తుపల్లి గ్రామంలోని దళిత కుటుంబానికి చెందిన బొల్గురి లింగస్వామి(46)కి రెండు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలికి తీవ్ర గాయం కావడంతో ఆపరేషన్ చేసి కాలును పూర్తిగా తొలగించారు.

రెక్కాడితేకానీ డొక్కాడని నిరుపేద దళిత కుటుంబం పెద్ద దిక్కుకు ఈ దుస్థితి రావడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

భార్య జయమ్మ భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఆపరేషన్ కోసం రూ.11 లక్షలు అప్పు చేసింది.

వారికి ఇద్దరు సంతానం.ఒక వైపు అప్పులు, మరోవైపు కుటుంబ పోషణ ఆమెకు తలకు మించిన భారం కావడంతో దారుణమైన జీవితం గడుపుతున్నామని జయమ్మ బోరున విలపించారు.

మందులకు నెలకు సుమారు రూ.6 వేలు ఖర్చవుతుందని, వికలాంగుల ఫించన్ కూడా రావడంలేదని వాపోయింది.

ఇల్లు గడవకే పదవ తరగతి చదువుతున్న కుమారుడు మణికంఠ సెలవు రోజుల్లో తండ్రి మందుల కోసం కూలీనాలి పనులకు వెళుతూ ఆసరగా ఉంటున్నాడు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి దళిత బంధు పథకాని తనకు కేటాయించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించుకున్నామని, అది వస్తుందో లేదో తెలియదన్నారు.

సాయం అందించే దాతలు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్లకు ఫోన్ పే నెంబర్ 99126 67961, గూగుల్ పే నెంబర్ 95737 75552 చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.