యాదాద్రి జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అడ్డగుడూర్ మండలంలోని బొద్దుగూడెం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.దాంతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను సమీప ఆస్పత్రులకు తరలించారు.కాగా ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.

అనంతరం రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

కల్కి సీక్వెల్ రిలీజయ్యేది అప్పుడేనా.. అన్ని నెలలు ఆగితే కల్కి సీక్వెల్ ను చూడొచ్చా?