సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం! ఆరుగురు మృతి
TeluguStop.com
శ్రీరామనవవి రోజున దైవదర్శనం కోసం వెళ్తున్న భక్తులని మృత్యువు లారీ రూపంలో కబలిస్తుంది అని వారు ఊహించి ఉండరు.
అందరూ సరదాగా కలిసి వెళ్తున్న సమయంలో అనంతలోకాలకి చేరుతామని ఊహించి ఉండరు.ఇప్పుడు అలాంటి సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ లో జరిగింది.
ఖమ్మం క్రాస్ రోడ్డు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరు మంది మృత్యువాత పడ్డారు.
/br?
కోదాడలోని సిరి అపార్ట్‌మెంట్ కి చెందిన వారు తమ్మరలో శ్రీరామనవమి వేడుకలకు ఆటోలో వెళ్తున్నారు.
అదే సమయంలో ఖమ్మంవైపు నుంచి వస్తున్న వారి ఆటోను ఎదురుగా వస్తున్నా లారీ బలంగా ఢీకొంది.
ప్రమాద సమయంలో ఆటోలో సుమారు పది మంది ప్రయాణిస్తూ ఉండగా వారిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తుంది.
ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని కోదాడ ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.