జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.బస్సు డ్రైవర్ కు గాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

రేగొండ మండలం బాగిర్తిపేట క్రాస్ రోడ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి వచ్చాక రిటర్న్ చేస్తున్నారా? ఇకపై బాదుడే