సినిమా హీరోలపై విరుచుకు పడ్డ రోజా భర్త

కరోనా విపత్తు నేపథ్యంలో సినిమా హీరోలు భారీగా విరాళం ఇవ్వాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తోటి సినీ కార్మికులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌ కే సెల్వమణి సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలపై విరుచుకు పడ్డాడు.

గత కొన్ని రోజులుగా సినీ కార్మికుల సహాయార్థం విరాళాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా కూడా ఒక్కరు ఇద్దరు తప్ప ఎవరు కూడా ముందుకు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ సమయంలో కనీస మానవత్వం లేకుండా విజ్ఞత లేకుండా స్టార్స్‌ ప్రవర్తిస్తున్నారు అంటూ ఆయన అన్నాడు.

ఎంతో మంది ప్రముఖ స్టార్స్‌ ఉన్న తమిళ ఇండస్ట్రీ నుండి ఇప్పటి వరకు కేవలం 1.

75 కోట్ల రూపాయలు ఇంకా 30 లక్షల వరకు బియ్యం విరాళంగా అందినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.

ఇప్పటికైనా కార్మికుల సహాయార్థం ప్రతి ఒక్కరు కూడా సాయం చేసేందుకు ముందుకు రావాలంటూ విజ్ఞప్తి చేశాడు.

"""/"/ తమిళ సినిమా ఇండస్ట్రీ వారితో పోల్చితే తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు పలువురు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

ఈ సమయంలో టాలీవుడ్‌ నుండి సీసీసీ అంటూ చిరంజీవి ఆధ్వర్యంలో ఒక ఛారిటీ ఏర్పాటు చేశారు.

దానికి గాను ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయల విరాళాలు అందినట్లుగా తెలుస్తోంది.

ఈ విషయంలో టాలీవుడ్‌ ప్రముఖులను అభినందించాలి.అందుకే రోజా భర్త సెల్వమణి తమిళ స్టార్స్‌పై విమర్శలు.

శంకర్ విషయం లో చాలా తక్కువ అంచనా వేస్తున్న జనాలు…