బుల్లితెర పైకి రీ ఎంట్రీ ఇచ్చిన మాజీ మంత్రి ఆర్ కే రోజా…ఎక్కడంటే!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి రోజా సెల్వమని(Roja Selvamani) ఒకరు.

ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రోజా అనంతరం రాజకీయాలలోకి వచ్చారు.

ఇక రాజకీయాలలో కూడా ఈమె రెండు సార్లు ఎమ్మెల్యే గాను అలాగే మంత్రిగా కూడా గెలుపొందారు.

2014 ఎన్నికలలో నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.అలాగే 2019లో కూడా ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు.

"""/" / ఇలా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా రోజూ జబర్దస్త్(Jabardasth) కార్యక్రమంతో పాటు ఇతర బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేసేవారు.

అయితే ఎప్పుడైతే మంత్రి అయ్యారో తనపై మరిన్ని బాధ్యతలు ఉన్నాయని ఈమె బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ కేవలం రాజకీయ కార్యకలాపాలలోనే బిజీగా మారిపోయారు.

అయితే 2024 ఎన్నికలలో రోజా ఓటమిపాలు అయ్యారు.అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ(YSRCP) కూడా ఓడిపోవడంతో రోజా తిరిగి సినిమా ఇండస్ట్రీపై ఫోకస్ చేశారని తెలుస్తుంది.

"""/" / ఈ క్రమంలోనే ఈమెను సినిమాలలో ప్రయత్నాలు చేస్తున్నారని వార్తల కూడా వచ్చాయి అయితే తాజాగా రోజా బుల్లితెర పైకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

జీ తెలుగు(Zee Telugu)లో ప్రసారం కాబోతున్న సూపర్ సీరియల్ ఛాంపియన్‌ షిప్ (Super Serial Champion Ship 4) 4లోకి రోజా రీ ఎంట్రీ ఇచ్చింది.

దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్  చేయగం ఈ ప్రోమో వీడియోలో రోజా కనిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

ఇక రోజాతో పాటు సీనియర్ నటుడు శ్రీకాంత్ రాశి కూడా ఈ ప్రోమో వీడియోలో కనిపించారు దీంతో రోజా తిరిగి బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చారని స్పష్టమవుతుంది.

ఇక ఈ కార్యక్రమం మార్చి రెండో తేదీ నుంచి ప్రసారం కాబోతుంది ఈ కార్యక్రమానికి రవి అశు రెడ్డి యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు.