రోజాకూ తాడేపల్లి పిలుపు ! జగన్ ఆ విషయం చెప్పేస్తున్నారా ?

వైసిపిలో కీలక నాయకురాలిగా ఉన్న నగరి వైసిపి ఎమ్మెల్యే మంత్రి ఆర్కే రోజా( RK Roja )కు తాడేపల్లి నుంచి పిలుపు అందింది.

ప్రస్తుతం వైసీపీలో నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు చేర్పుల వ్యవహారం జరుగుతోంది.అనేక సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలకు అనుగుణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే పనిలో జగన్ నిమగ్నం అయ్యారు .

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న దృస్ట్యా  భారీ ప్రక్షాళనకు దిగారు.వైసిపి ప్రభుత్వం పై జనాల్లో సానుకూలత ఉన్నా , నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వ్యవహారాల కారణంగా వారిపై జనాల్లో వ్యతిరేకత ఉంది అని,  అభ్యర్థులను మారిస్తే వైసిపి విజయానికి డొఖా ఉండదనే విషయాన్ని గుర్తించిన జగన్ , దానికి అనుగుణంగా ఈ భారీ ప్రక్షాళనకు తెర తీశారు.

ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లుగా జగన్ ప్రకటించారు .ఇంకా అనేక మార్పు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి .

"""/" / మంత్రి రోజా తో పాటు,  రాష్ట్ర వ్యాప్తంగా మరికొంతమంది ఎమ్మెల్యేలకు తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు అందింది.

ఉమ్మడి తూర్పుగోదావరి,  పశ్చిమగోదావరి, నెల్లూరు ,చిత్తూరు, అనంతపురం,  కడప జిల్లాలో భారీ మార్కులకు జగన్( YS Jagan ) శ్రీకారం చుట్ట బోతున్నారు.

ఈ మేరకు దీనికి  సంబంధించిన రెండో జాబితా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

కొద్దిరోజులుగా అభ్యర్థులు ఎంపిక నియోజకవర్గ ఇన్చార్జిల మార్పుకు సంబందించిన సమావేశాలకు విరామం ఇచ్చింది.

  అయితే నేటి నుంచి దీనిని మళ్లీ ప్రారంభించింది.ఉత్తరాంధ్ర , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అభ్యర్థుల మార్పు విషయంలో జగన్ కీలక నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారట.

"""/" / అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదని వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్న నగరి నియోజకవర్గాని( Nagari Assembly Constituency )కి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా కూడా ఈసారి టిక్కెట్ దక్కే అవకాశం లేదట.

ఈ నేపథ్యంలో నేడు తాడేపల్లి జగన్ కార్యాలయం నుంచి రోజుకు పిలుపు అందడంతో ,జగన్ రోజాకు ఏ హామీ ఇస్తారు ? ఏ విధంగా బుజ్జగిస్తారు అనేది తేలాల్సి ఉంది.

అయితే ఇప్పటికీ తనకు నగరి టికెట్ దక్కకపోయినా, జగన్ కోసం పనిచేస్తానని రోజా ప్రకటించారు .

ఈ నేపథ్యంలో జగన్ రోజా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది నేడు తేలనుంది.

అల్లు అర్జున్ కోసం పని చేసిన లాయర్ ఫీజు ఎంతో తెలుసా.. వామ్మో ఇంత తీసుకుంటారా?