దానికి మించిన పాఠం మరొకటి ఉండదు.. రితికా సింగ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

రితికా సింగ్( Ritika Singh ).ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా గురు( Guru ).

వెంకటేష్ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకుంది రితికా సింగ్.

అయితే ముద్దుగుమ్మ హీరోయిన్ కాకముందే కరాటే లో బ్లాక్ బెల్ట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.

కిక్ బాక్సర్ గా కూడా రానించింది.అయితే గురు సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కడతాయని అందరూ భావించారు.

"""/" / కానీ ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు మాత్రం రాలేదు.సినిమాల్లో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు వీడియోలతో అభిమానులకు టచ్ లో ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా రితిగా సింగ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.మేము ముంబైలోని( Mumbai ) అవుట్‌కట్స్‌లో ఉండేవాళ్లం.

కాలేజీకి వెళ్లటానికి రెండు గంటల సమయం పట్టేది మెట్రోలో.ఎక్కువగా కాలేజీ క్లాసులో కూర్చోలేకపోయేదాన్ని.

"""/" / ఎందుకంటే కరాటేనే నా ప్రపంచం.మూడేళ్ల వయసులో కరాటే నేర్చుకోవటం ప్రారంభించాను.

మా నాన్న, తాతయ్యలు కరాటే, బాక్సింగ్‌ ఫీల్డ్‌ నుంచి వచ్చారు.కాబట్టి నాకు అబ్బింది.

మా అన్న కూడా మార్షల్‌ ఆర్ట్స్‌లో ఉన్నారు.ఉదయాన్నే లేవటం వ్యాయామం చేయటం చేసేదాన్ని.

మా నాన్నే నాకు స్ఫూర్తి.ఇకపోతే కాలేజీ రోజుల్లో స్పోర్ట్స్‌ నా మొదటి ప్రయారిటీ.

నాకెవరూ స్నేహితులు కూడా ఉండేవాళ్లు కాదు.స్నేహితులు లేకపోవటం వల్ల బాధపడేదాన్ని.

నేను చదువలను నెగ్లెట్‌ చేయలేదు.డిగ్రీ చదివాను.

చేసే పనిలో వందశాతం ఇవ్వాలి అని అనుకుండేదాన్ని అని చెప్పుకొచ్చింది.

పవన్ అంటేనే ఇష్టం.. కమెడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు!