బాబోయ్.. మనాలి నుంచి కన్యాకుమారికి స్కేట్‌బోర్డ్‌పై ప్రయాణం.. హిస్టరీ క్రియేటెడ్!
TeluguStop.com
స్కేట్‌బోర్డ్‌పై( Skateboard ) పదుల కిలోమీటర్లు కవర్ చేయడం సులభమే కానీ వేల కిలోమీటర్లు దానిపై ప్రయాణించడం అంటే అది మాటలు కాదు.
ముఖ్యంగా మనాలి నుంచి కన్యాకుమారి వరకు స్కేట్‌బోర్డ్‌పై ప్రయాణం అసాధ్యమని చెప్పుకోవచ్చు.కానీ రితిక్ క్రాట్జెల్( Ritik Kratzel ) ఆసాధ్యాన్ని సుసాధ్యమని నిరూపించాడు.
చిన్న బ్యాక్‌ప్యాక్ మాత్రమే తోడుగా, ఈ యువ స్కేట్‌బోర్డర్ 90 రోజుల పాటు భారతదేశాన్ని ఒక చివర నుంచి మరొక చివర వరకు స్కేట్ చేస్తూ చరిత్ర సృష్టించాడు.
దట్టమైన పొగమంచు, చెడిపోయిన రోడ్లు, గూగుల్ మ్యాప్స్ పనిచేయకపోవడం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు రితిక్.
కానీ అతని ధైర్యం, స్కేట్‌బోర్డింగ్ పట్ల ఉన్న అభిరుచి అతనికి ఊతం ఇచ్చాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో రితిక్ తన యాత్రను డాక్యుమెంట్ చేశాడు.అతని స్కేటింగ్ వీడియోలు దారిలో చూసిన అందమైన దృశ్యాలు, ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలియజేస్తూ అందరినీ ఆకట్టుకున్నాయి.
రితిక్ యాత్ర ఒక సాహసోపేతమైన కథ మాత్రమే కాదు, సంకల్పం ఏం సాధించగలదో తెలియజేసే ఒక ప్రేరణాత్మక కథ కూడా.
"""/" /
H3 Class=subheader-styleరితిక్ యాత్ర గురించి కొన్ని ముఖ్య విషయాలు:/h3p
మొత్తం దూరం: 4,000 కిలోమీటర్లు
ప్రయాణ కాలం: 90 రోజులు
ప్రయాణ మార్గం: మనాలి - ఢిల్లీ - ఆగ్రా - జైపూర్ - గ్వాలియర్ - భోపాల్ - నాగ్‌పూర్ - హైదరాబాద్ - బెంగళూరు - చెన్నై - కన్యాకుమారి """/" /
"మనాలి టు కన్యాకుమారి స్కేట్ జర్నీ"( Manali To Kanyakumari Skate Journey ) పేరుతో చివరి వీడియో రితిక్ అద్భుతమైన ఒడిస్సీకి పరాకాష్టగా నిలిచింది.
అందులో వ్యూయర్లు అతని మొదటి రోజు నుంచి అతని చివరి భావోద్వేగ క్షణాల వరకు క్లిప్‌లను చూశారు.
ఈ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.దీనికి 250,000 వ్యూస్‌కి పైగా వచ్చాయి.
రితిక్ సాహసయాత్ర జనవరి 7న ప్రారంభమైంది.ఏప్రిల్ 1న, అతను దిగ్విజయంగా భారతదేశంలోని దక్షిణాదిన ఉన్న కన్యాకుమారికి చేరుకున్నాడు.
అతని విజయం పట్ల తోటి సాహసికులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.
నేనెందుకు పట్టించుకోవాలి… షర్మిల వివాదంపై బాలయ్య కామెంట్స్ వైరల్!