వీడియోలు మార్ఫింగ్ చేసి దారుణమైన కామెంట్లు పెడుతున్నారు.. రీతూ చౌదరి ఫైర్?
TeluguStop.com
జబర్దస్త్ కార్యక్రమం( Jabardast Programme ) ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో రీతూ చౌదరి( Rithu Chowdary ) కూడా ఒకరు.
ఈమె బుల్లితెరపై సీరియల్స్ లో కూడా నటించి సందడి చేశారు.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అయితే సోషల్ మీడియా వేదికగా రీతూ చౌదరి చేసే వీడియోలు ఫోటోలకు భారీ స్థాయిలో నెగిటివ్ కామెంట్లు కూడా వస్తూ ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే అయితే తాజాగా తన గురించి నేటిజన్స్ చేసే కామెంట్లపై రియాక్ట్ అవుతూ ఈమె చేస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"""/" /
కొంతమంది ఆకతాయిలు నాకు తెలియకుండానే నా వీడియోలన్నింటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో( Social Media ) షేర్ చేస్తున్నారని పైగా ఆ వీడియోలను నాకే ట్యాగ్ చేశారు అంటూ ఈమె తెలియజేశారు.
ఇలా ఆ వీడియోలు నాకు ట్యాగ్ చేసే వరకు మార్ఫింగ్ చేశారు అనే విషయం నాకు తెలియదు.
ఇది జరిగి దాదాపు 5 నెలలు అవుతుంది కానీ ఈ విషయం బయటకు చెప్పాలా వద్దా అని ఎంతగానో ఆలోచించాలని ఈమె తెలియజేశారు.
ఇక ఈ విషయం శ్రీకాంత్ కి తెలిసి నువ్వు కానప్పుడు ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు అంటూ నాకు ధైర్యాన్ని ఇచ్చారు మా అమ్మ అన్నయ్య అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు.
"""/" /
ఇలా వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా దారుణమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు అంతేకాకుండా నేను షేర్ చేసే ఫోటోలు వీడియోలు పై కూడా చాలామంది దారుణమైన బూతు కామెంట్లు చేస్తున్నారని వారందరి లింక్స్ కూడా నేను సైబర్ క్రైమ్ పోలీసులు ( Cyber crime Police )వారికి ఇచ్చాను అంటూ ఈమె వెల్లడించారు.
ఏదైనా ఫోటోలు షేర్ చేస్తే ఒకరోజు నైట్ కు ఎంత .నాతో వస్తావా, అవకాశాలు లేకపోవడంతో ఇలా చేస్తున్నావా అంటూ ఇలా దారుణంగా కామెంట్లు చేస్తున్నారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈమె షేర్ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గోల్డ్ కార్డ్ తెచ్చిన ట్రంప్.. ఈజీగా అమెరికా పౌరసత్వం, వాళ్లకు మాత్రమే..!