వామ్మో..శ‌రీరంలో విట‌మిన్ బి12 లోపిస్తే ఇన్ని స‌మ‌స్య‌లా?

శ‌రీరానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ బి12 ఒక‌టి.మెదడు, నరాల వ్యవస్థ సరిగ్గా పని చేయాల‌న్నా, ఎర్ర రక్త కణాలు పెర‌గాల‌న్నా, డిఎన్ఎ సింథసైజ్ అవ్వాల‌న్నా విట‌మిన్ బి12 ఎంతో అవ‌స‌రం.

అయితే ఇది జంతు సంబంధ ఉత్పత్తుల నుంచే ప్ర‌ధానంగా అందుతుంది.అందు వ‌ల్ల‌నే శాకాహారుల్లో విట‌మిన్ బి12 లోపం కాస్త అత్య‌ధికంగా క‌నిపిస్తుంది.

ఇక పొర‌పాటున విట‌మిన్ బి12 లోపాన్ని నిర్ల‌క్ష్యం చేశామా.అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదురోవాల్సి వ‌స్తుంది.

ముఖ్యంగా శ‌రీరంలో విట‌మిన్ బి12 లోపిస్తే కంటి చూపు మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు త‌లెత్త‌డం, కొలెస్ట్రాల్ పెరిగి పోవ‌డం, త‌ర‌చూ త‌ల నొప్పి, చ‌ర్మం పాలి పోవ‌డం, ర‌క్త హీన‌త, ఆక‌లి లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి వ‌స్తుంది.

అంతేకాదు, అలసట, జ్ఞాప‌క శ‌క్తి లోపించ‌డం, నాలుక రుచి కోల్పోవడం, చికాకు, కాళ్ళూ, చేతులూ తిమ్మిర్లు, ర‌క్త పోటు పెరిగి పోవ‌డం, నీరసం, జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మంద‌గించ‌డం, రోగ నిరోధక వ్య‌వ‌స్థ బ‌ల‌హీన ప‌డిపోవ‌డం, కడుపులో పుండ్లు, ఉన్న‌ట్టు ఉండి బ‌రువు త‌గ్గిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా వేధిస్తాయి.

"""/" / అందుకే శ‌రీరంలో ఎప్పుడూ విట‌మిన్ బి12 కొర‌త ఏర్ప‌డ‌కుండా ఉండాలి.

అలా ఉండాలీ అంటే.ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని ఆహ‌రాల‌ను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.

మ‌రి ఆ ఆహారాలు ఏంటో కూడా చూసేయండి.పాలు, పెరుగు, ఛీజ్, బటర్, మ‌జ్జిగ వంటి వాటిలో విటిమ‌న్ బి12 పుష్క‌లంగా ఉంటుంది.

అలాగే చేప‌లు, చికెన్ లివ‌ర్‌, బీఫ్‌, క్రాబ్‌, గుడ్డు వంటివి తీసుకోవ‌డం ద్వారా కూడా విట‌మిన్ బి12 లోపానికి దూరంగా ఉండొచ్చు.

శాకాహారులైతే.తృణధాన్యాలు, సోయా పాలు, సోయా బీన్స్ వంటి తీసుకుంటే.

విట‌మిన్ బి12 లోపం ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.

అమెరికాలో స్టాలిన్ సైకిల్ సవారీ.. వీడియో వైరల్