భద్రాచలం వద్ద పెరుగుతోన్న గోదావరి ఉధృతి
TeluguStop.com
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతోంది.
బ్రిడ్జి వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46 అడుగులకు చేరింది.
ఈ క్రమంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.మరోవైపు భద్రాద్రి రామాలయం చుట్టూ వరద నీరు భారీగా చేరింది.
విస్తా కాంప్లెక్స్ తో పాటు అన్నదాన సత్రం నీటమునిగాయి.ఎగువ ప్రాంతంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది.
దాంతో పాటు పై నుంచి వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఇక మూడు రోజులే.. అలాంటివారు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాల్సిందే..