వంటగదికి మంటలు పెడుతున్న ప్రభుత్వాలు.. పాపం పెరిగినట్టు పెరుగుతోన్న గ్యాస్ సిలిండర్ ధరలు!

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, నిత్యవసరాలపై పెరిగిపోతున్న ధరలు సామాన్యులని తీవ్ర దారిద్ర్యంలోకి నెట్టేస్తున్నాయి.

ఈ ధరలు అనేవి తరచూ పెరగడం వలన ప్రజలు సతమవుతున్నారు.ఇలాంటి ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై మరోమారు గుది బండ వేసింది.

అవును.గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది.

గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ పై రూ.3.

50 పెరిగింది.కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.

8 పెంచారు.పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయని సమాచారం.

దేశ వ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు రూ.1000 పైనే వున్నాయి.

ఈ మే నెలలో 2వ సారి LPG గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి మరోసారి వినియోగదారుడికి మొట్టికాయలు వేస్తున్నాయి.

ఈ ఏడాది కాలంలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ.

200, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.750 పైగా పెరగడం దురదృష్టకరం.

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతున్నాయి అని చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో ధరలు రూ.2354, కోల్‌కతాలో రూ.

2454, ముంబైలో రూ.2306, చెన్నైలో రూ.

2507గా వున్నాయి. """/" / గత కొన్నాళ్లుగా వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనేవున్నాయి.

ఇక నిత్యవసరాల ధరలకైతే లెక్కేలేదు, ఆకాశాన్నంటుతున్నాయి.ఓ వేయి రూపాయిల కాగితానికి ఇపుడు విలువ లేకుండా పోయింది.

దాంతో పేదవారు గెంజి కాచుకుకొని బతుకునీడుస్తున్నారు.మార్కెట్లో కూరగాయలు రేట్లు కూడా ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి.

దీనికి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ప్రజలపై పెను భారం పడుతోంది.

పెడన సభలో మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ కీలక హామీ..!!