ఇంధన సెగ ఎడాపెడా.. మళ్లీ పెరిగిన గ్యాస్, పెట్రో ధరలు

ఒకవైపు పెట్రోల్ ధరలు మరోవైపు వంటగ్యాస్ రేట్లతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.పెట్రోల్ రేట్లు నిత్యం పెరుగుతుండగా.

సిలిండర్ ధరలు మాత్రం 15 రోజులకు ఒకసారి పెరుగుతూ.బతుకును భారంగా మార్చేస్తున్నాయి.

తాజాగా బుధవారం మరోసారి గృహ వినియోగ, కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగాయి.14.

2 కేజీల సిలిండర్ రూ.15 మేర పెరిగింది.

తాజా పెంపుతో దేశ రాజధాని న్యూఢిల్లీలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.

899.50కి చేరింది.

5 కేజీల సిలెండర్ రూ.502కి చేరిందిసవరించిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి.

దేశవ్యాప్తంగా ఇదే స్థాయిలో ధరలు పెరిగాయి.సబ్సిడీ భారాన్ని మోస్తున్న నేపథ్యంలో సిలిండర్ ధరలను పెంచాలని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం నిర్ణయించాయి.

మరోవైపు కమర్షియల్ గ్యాస్ 19 కేజీలు ఎల్ పీజీ సిలిండర్ ఈనెల ప్రారంభంలోనే రూ.

43 మేరా పెరగడంతో రూ.1736 కు చేరింది.

ఎల్ పీజీ, డిజెల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో ధరలకు అనుగుణంగా దేశీయంగా పెరుగుతున్నాయి.

ఓపెన్, అనుబంధ దేశాల్లో ఉత్పత్తికి అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరల వ్యత్యాసం ఉంటుంది.

వరుసగా రెండో రోజు కూడా పెట్రోల్ ధరలు పెరిగాయి.దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో బుధవారం పెట్రోల్ రేట్లు పెరిగాయి.

న్యూ ఢిల్లీ లో పెట్రోల్ రేటు 30 పైసల మేర పెరిగి రూ.

102.94 చేరింది.

ఇక డీజిల్ ధర ఢిల్లీలో 35 పైసల మేర పెరిగి రూ.91.

82 చేరిందని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల నోటిఫికేషన్ పేర్కొంది. """/"/ కాగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర అంతకంతకూ పెరుగుతోంది.

బుధవారం క్రూడ్ బ్యారెల్ 82.53 డాలర్ల పెరిగింది.

వెస్త్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లో క్రూడ్ బ్యారెల్ ధర  రూ.78.

87 డాలర్లకు చేరింది.2014 తర్వాత ఇదే అత్యధికం.

క్రూడ్, నేచురల్ గ్యాస్, బొగ్గు ఉత్పత్తి తగ్గడం ఇదే సమయంలో ఇంధన వినియోగం పెరిగిన నేపథ్యంలో ఇంధన సప్లై కొరత ఏర్పడటం ఆందోళన కలిగిస్తుంది.

వైరల్ : అయ్యబాబోయ్.. 3 రోజుల్లో 60 మందిని పెళ్లాడిన మహిళ..