పెన్ గంగా నదికి పెరుగుతున్న వరద.. భారీగా ట్రాఫిక్ జామ్
TeluguStop.com
తెలంగాణతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో గోదావరి నది ఉపనది పెన్ గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది.
ఆదిలాబాద్ జిల్లాలోని పెన్ గంగా నదికి వరద ఉధృతి భారీగా పెరుగుతోంది.దీంతో ఆదిలాబాద్ జిల్లా ఎన్ హెచ్-44 పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
తెలంగాణ - మహారాష్ట్ర రెండు వైపుల భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అదేవిధంగా డొల్లార వద్ద అంతరాష్ట్ర వంతెనలను తాకుతూ పెన్ గంగా ఉధృతంగా ప్రవహిస్తుంది.
చెనాక కోరాట బ్యారేజ్ వద్ద నిండుగా ప్రవహిస్తుంది.ఈ క్రమంలో చెనాక కోరాట పంప్ హౌస్ జలదిగ్బంధంలో చిక్కుకుంది.
రైలు ప్రయాణంలో టికెట్ లేకున్నా టీటీని బెదిరించిన ప్రయాణికుడు.. (వీడియో)