రిషిరాజ్ సింగ్ సంచలన వాఖ్యలు

అతిలోక సుందరి శ్రీదేవి మరణం ఇప్పటికి ఒక రహస్యంగా మిగిలిపోయింది.ఆమె ఎలా చనిపోయింది అనేదానికి ఎవరు స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఆమె నీటి తొట్టెలో పడి ఊపిరాడక చనిపోయింది అని బయట ప్రపంచానికి తెలియజేసిన, దాని వెనుక ఇంకా ఏదో మిస్టరీ ఉందనే అనుమానాలు మాత్రం చాలా మందిలో బలంగా ఉన్నాయి.

ఆమెది సాధారణ మరణం కాదని చాలా మంది ఇప్పటికే బహిరంగంగా చెప్పారు.ఆమెని ఒక ప్లాన్ ప్రకారం హత్య చేసారని పదే పదే చెబుతున్నారు.

ఇందులో వాస్తవం ఉండే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు.ఇలాంటి వ్యాఖ్యల మీద శ్రీదేవి ఫ్యామిలీ మాత్రం స్పందించడం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా కేర‌ళ డీజీపీ రిషిరాజ్ సింగ్ శ్రీదేవి మ‌ర‌ణం ప్ర‌మాదం కాద‌ని, ప‌థ‌కం ప్ర‌కారం హ‌త్య చేశార‌ని మరోసారి సంచలన వాఖ్యలు చేసారు.

శ్రీదేవిని హ‌త్య చేసి చంపేశార‌ని, నా స్నేహితుడు ఫొర్సెనిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ఉమాద‌తాన్ చెప్పారు.

ఆమెది హ‌త్య అనే విష‌యాన్ని తెలియ‌జేసేలా ఆధారాలు కూడా చూపిస్తున్నాడు అని వ్యాఖ్యలు చేసారు.

మ‌ద్యం ఎక్కువ‌గా సేవించి ఉంటే కేవ‌లం ఒక అడుగులోతు నీరు మాత్ర‌మే ఉన్న బాత్ ట‌బ్‌లో చ‌నిపోయే అవ‌కాశం లేద‌ని, ఆమెను ఎవ‌రైనా వెనుక నుండి నీటిలో ముంచి చంపేసి ఉంటారని త‌న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు.

ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీస్ ఇలాంటి వాఖ్యలు చేయడం ఇప్పుడు మరోసారి శ్రీదేవి మరణం హాట్ టాపిక్ గా మారింది.