అయ్యో పాపం.. కాంతార మూవీకి రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ అంత తక్కువా?
TeluguStop.com
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార ఎన్నో సంచలనాలు సృష్టించగా ప్రస్తుతం ఓటీటీలో కూడా ఈ సినిమా ఆకట్టుకుంటోంది.
మరీ కొత్త కథ కాకపోయినా అద్భుతమైన సన్నివేశాలు ఉండటం ఈ సినిమా సక్సెస్ కు సంబంధించి కీలక పాత్ర పోషించింది.
ఈ సినిమా రిషబ్ శెట్టికి పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిపెట్టడంతో రిషబ్ శెట్టి ప్రతిభకు తగ్గ సక్సెస్ దక్కిందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
కాంతార సక్సెస్ తో రిషబ్ శెట్టి గత సినిమాలను సైతం డబ్ చేసి తెలుగు, ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంటే కాంతార సినిమాతో రిషబ్ శెట్టి ప్రేక్షకులకు ఏ స్థాయిలో దగ్గరయ్యారో అర్థమవుతుంది.
రిషబ్ శెట్టికి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ల నుంచి కూడా భారీ రెమ్యునరేషన్ తో ఆఫర్లు వస్తున్నాయి.
అయితే కాంతార మూవీకి మాత్రం ఈ స్టార్ హీరో చాలా తక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను అందుకున్నారు.
"""/" /
కాంతార మూవీకి హీరోగా, డైరెక్టర్ గా పని చేసిన రిషబ్ శెట్టికి ఈ సినిమాతో దక్కిన రెమ్యునరేషన్ కేవలం ఐదున్నర కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
అయితే సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించడంతో నిర్మాతలు సినిమా రిలీజ్ తర్వాత మరో 5 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చారని బోగట్టా.
400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాకు రిషబ్ శెట్టికి కేవలం 10.
5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ దక్కింది.రిషబ్ శెట్టి ప్రతిభకు ఈ మొత్తం తక్కువే అయినా రాబోయే రోజుల్లో పాన్ ఇండియా హీరోలకు ధీటుగా రిషబ్ శెట్టికి రెమ్యునరేషన్ దక్కే అవకాశాలు ఉండటంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
కాంతార సినిమాతో రిషబ్ శెట్టి ఇతర స్టార్ హీరోల దృష్టిలో పడ్డారు.రిషబ్ మంచి కథ, కథనాలతో కూడిన సినిమాల్లో నటించి మరింత ఎదగాలని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ప్రపంచ రికార్డులను క్రియేట్ చేసిన సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్.. (వీడియో)