కాంతారా సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?
TeluguStop.com
కాంతారా.ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా పేరే ఒక మోత ముగిపోతుంది.
రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా భారత దేశ సినిమా పరిశ్రమ యొక్క రూపురేఖలను మార్చేస్తుంది.
ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా మంచి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.
కేవలం కన్నడలో మాత్రమే ఈ సినిమా విజయవంతం సాధిస్తే దీని గురించి ఎవరు ఇంతగా మాట్లాడుకునే వాళ్ళు కాదు.
కానీ అన్ని భాషల్లో కూడా విడుదలైన ఈ చిత్రం ఎంతో మంచి రివ్యూలను దక్కించుకుంటుంది.
ఈ సినిమా మొదట కర్ణాటకలో విడుదలైంది.అయితే తెలుగులో నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో విడుదల చేశారు.
అయితే ఇది తెలుగులో కూడా భారీ వసూలను సాధించడం విశేషం.ఇక ఇది ఒక సాంప్రదాయకమైన సినిమా.
కేరళలోని బూటా కోలా, కాంబ్లా అనే ఒక ట్రెడిషన్ ని ప్రపంచానికి తెలియజేస్తూ కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో తీస్తూ ఒక ముఖ్యమైన పాత్రను కూడా పోషించాడు.
ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో రిషబ్ శెట్టి పాల్గొని తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని, తమకు ఎన్టీఆర్ తో ఉన్న సంబంధం ఏంటో కూడా తెలియజేశాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉంటారు కానీ నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటేనే అమితమైన ఇష్టం.
"""/"/
అంతే కాదు మా మధ్య ఒక బంధం కూడా ఉంది.ఎన్టీఆర్ తల్లి అయిన శాలిని మా గ్రామంలో పుట్టి పెరిగారు అంటూ చెప్పుకొచ్చారు.
ఇక మీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందా అని విలేకరులు ప్రశ్నించగా తనకు అలాంటి ఆలోచనలైతే ఏమీ లేదని ఒకవేళ మంచి కథ ఉంటే తప్పకుండా చేయడానికి ముందు ఉంటానంటూ తెలిపారు రిషబ్.
ఇక షాలిని పుట్టింది కర్ణాటకలోని కుందపురం అనే ఒక గ్రామం లో.ఇది ఉడిపి సమీపంలో ఉంది.
కూడా కుందపురం గ్రామంలోనే రిషబ్ శెట్టి కూడా పుట్టారు.ఇక కాంతారా సినిమాకి మన తెలుగు హీరోలు అలాగే తమిళ హీరో నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
ఇప్పటికే ప్రభాస్ తనదైన రీతిలో ఈ సినిమాపై స్పందించాడు.
ఏది నీది కానప్పుడు భయం ఎందుకు… సంచలనంగా మారిన మంచు లక్ష్మీ పోస్ట్!