జై హనుమాన్ లో హనుమంతుడిగా రిషబ్.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమా?
TeluguStop.com
కాంతార సినిమాతో రిషబ్ శెట్టి ( Rishab Shetty )పేరు బాక్సాఫీస్ వద్ద మారుమ్రోగిందనే సంగతి తెలిసిందే.
కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించడం సులువైన విషయం కాదు.
ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ తో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
"""/" /
అయితే జై హనుమాన్ ( Jai Hanuman )లో హనుమంతుడిగా రిషబ్ శెట్టి నటించనున్నారని వార్తలు వినిపించాయి.
వైరల్ అవుతున్న వార్తలు నిజమైతే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.మరోవైపు ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన హనుమాన్ మూవీ అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
జై హనుమాన్ మూవీపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
"""/" /
జై హనుమాన్ మూవీతో బాక్సాఫీస్ వద్ద మరోసారి షేక్ కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై అంచనాలు పెరిగే అవకాశాలు ఉంటాయి.
రిషబ్ శెట్టి ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.
కథ అద్భుతంగా ఉంటే మాత్రమే రిషబ్ శెట్టి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రిషబ్ శెట్టి భిన్నమైన ప్రాజెక్ట్ లను ఎంచుకోవడం ద్వారా కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.
రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా క్రేజ్ ను ఊహించని స్థాయిలో పెంచుకుంటున్నారు.
రిషబ్ శెట్టి సినిమాలకు అనుగుణంగా లుక్స్ ను మార్చుకోవడంతో పాటు తన సినిమాల సక్సెస్ రేట్ ను పెంచుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మామకు తోడుగా నిలిచిన కోడలు పిల్ల…. పిఠాపురం కోసం ఉపాసన సంచలన నిర్ణయం?