రిషబ్ శెట్టి కాపీ ట్యూన్స్ తో తీసిన సినిమాలు ఇవే !

కాంతారా సినిమా తర్వాత దేశం మొత్తం రిషబ్ గురించే మాట్లాడుతుంది.సినిమా హిట్ అయ్యిందంటే ఒకటి బాగా పాజిటివ్ వైబ్స్ వస్తాయి.

లేదంటే నెగటివ్ వైబ్స్ అయినా కొట్టేస్తాయి.అయితే కాంతారా సినిమా వచ్చిన తర్వాత అందరు సంస్కృతి, సంప్రదాయాల గురించే మాట్లాడుతూ సినిమాను పొగుడుతూ మాట్లాడుతూ ఉన్నారు.

అయితే ఇదే అదనుగా తమ పాటను కాపీ చేసి వరాహరూపం పాటగా మార్చి సినిమాలో పెట్టారని ఒక ప్రైవేట్ మలయాళ మ్యూజిక్ కంపెనీ కేసు వేసింది.

కాంతారా సినిమాకు వరాహారుపం పాట ప్రాణవాయువు లాంటిది.ఈ పాట లేని సినిమాను ఊహించలేం.

ఈ ప్రైవేట్ పాటను, వరాహరూపం పాటను పోల్చి చూస్తే దాదాపుగా ఎలాంటి పోలికలు కనిపించలేదు.

చూసేవారికి కూడా అలాంటి అనుమానం లేదు.కానీ కాంతారా సినిమా నుంచి ఆ పాటను తొలగించాలని, అన్ని ప్లాట్ ఫామ్స్ నుంచి ఆ పాటను తొలగించాలని సదరు మ్యూజిక్ కంపెనీ స్టే తెచ్చుకుంది.

అయితే హోంబేలి సినిమా వారు ఈ తీర్పు పై హై కోర్ట్ ని ఆశ్రయించే అవకాశం ఉంది.

కానీ రిషబ్ శెట్టి ఇలాంటి సమయంలో అవతల పార్టీ తో మాట్లాడి ఒప్పించి వివాదం ముగించేలా చేయగల సమర్థుడే.

ఎందుకంటే ఇలా కాపీ ట్యూన్ వివాదం రావడం రిషబ్ కి ఇదేమి కొత్త కాదు;.

ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటన జరిగింది.అప్పుడు రిషబ్ తన చాకచక్యం తో బయట పడ్డాడు.

"""/"/ కానీ ఇప్పుడు సినిమా స్టాండర్డ్ పెరిగింది.పాన్ ఇండియా గా కాంతారా అవతరించింది కాబట్టి మరి రెండు పార్టీ లు ఒక సయోధ్యకు వచ్చే అవకాశం ఎంత మేర ఉందో చూడాల్సి ఉంది.

ఇక రిషబ్ శెట్టి కాపీ ట్యూన్స్ సినిమాల విషయానికి వస్తే గతంలో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది.

అది కూడా మన రష్మిక ను హీరోయిన్ గా పెట్టి తీసిన కిరాక్ పార్టీ చిత్రం కావడం విశేషం.

ఆరేళ్లకు ముందు వచ్చిన ఈ సినిమాలోని మధ్యరాత్రిలి అనే పాట కాపీ కొట్టారని లీగల్ ప్రొబ్లెమ్స్ ని ఎదుర్కొంది.

ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.అప్పట్లో లహరి మ్యూజిక్ వారు కిరాక్ పార్టీ పై కేసు వేశారు.

అయితే కాంతారా సినిమాలో లాగానే కిరాక్ పార్టీ కి కూడా మధ్య రాత్రిలి పాట ఒక ఆక్సిజన్ లాంటిది.

ఈ పంచాయితీ లాస్ట్ ఇయర్ వరకు సాగి రాజీతో ముగిసింది.

విశాల్ సినిమాకు భారీ షాకిచ్చిన తెలుగు ప్రేక్షకులు.. అక్కడే తప్పు జరిగిందా?