క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చేశాను.. హీరో రిషబ్ శెట్టి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
సౌత్ ఇండియా అంతటా ప్రస్తుతం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలలో రిషబ్ శెట్టి ( Rishabh Shetty )ఒకరు.
రిషబ్ శెట్టి ఒకింత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.వరుస ప్రాజెక్ట్ లకు రిషబ్ శెట్టి ఓకే చెబుతుండగా ది ప్రైడ్ ఆఫ్ భారత్ : ఛత్రపతి శివాజీ మహారాజ్ ( The Pride Of India: Chhatrapati Shivaji Maharaj
)అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా రిషబ్ శెట్టి ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించే ఛాన్స్ రావడం నాకు దక్కిన గౌరవంగా భావిసున్నానని ఆయన తెలిపారు.
ఛత్రపతి శివాజీకి నేను అభిమానినని ఆయన పేర్కొన్నారు.ఇలాంటి బయోపిక్ లలో అవకాశాలు చాలా అరుదుగా వస్తాయని రిషబ్ శెట్టి వెల్లడించారు.
ఆయన పాత్రకు ప్రాణం పోయడానికి సిద్ధంగా ఉన్నానని రిషబ్ చెప్పుకొచ్చారు.ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
"""/" /
నా దగ్గరకు వచ్చి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పిన వెంటనే నేను ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా ఓకే చేశానని ఆయన తెలిపారు.
శివాజీ చరిత్రను నేటి తరానికి చెప్పడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రిషబ్ పేర్కొన్నారు.అద్భుతమైన సినిమాటిక్ అనుభవం కోసం మాత్రమే కాదని శివాజీ గురించి ఇప్పటివరకు తెలియని కథలను తెలుసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు.
"""/" /
రిషబ్ శెట్టి వెల్లడించిన విషయాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.హిస్టారికల్ బ్యాక్ డ్రాప్( Historical Back Drop ) లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.
2027 సంవత్సరం జనవరి 21వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
జై హనుమాన్ సినిమాతో పాటు కాంతార ప్రీక్వెల్ తో రిషబ్ శెట్టి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
హనుమాన్ రికార్డ్ ను క్రాస్ చేసే సినిమా ఏది.. సంక్రాంతికి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?