ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్న కాంతారా హీరో.. ఇదే క్లారిటీ!
TeluguStop.com
కన్నడ ఇండస్ట్రీ నుండి ఇటీవలే కాంతారా వంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ వచ్చింది.
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన కాంతారా సినిమా కన్నడంలో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర అసాధారణమైన విజయాన్ని నమోదు చేసుకుంది.
కేవలం 16కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వందల కోట్లకు పైగానే కలెక్ట్ చేసి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ఇటు తెలుగుతో పాటు రిలీజ్ అయినా అన్ని భాషల్లో కూడా ఈ సినిమా తన పవర్ చూపించింది.
రెండు వారాలు ముగిసిన ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం ఇంకా సాగుతూనే ఉండడం విశేషం.
కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.
హోంబలే కెజిఎఫ్ తర్వాత మరోసారి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుని ఎంజాయ్ చేతిసుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమాపై మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ప్రశంసలు కురిపించారు.
ఈ సినిమాను చూసి ప్రత్యేకంగా అభినందించారు అని హీరో రిషబ్ శెట్టి స్వయంగా తెలిపారు.
ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరిగింది.తారక్ ఫ్యాన్స్ కూడా వీరి కాంబోలో సినిమా నిజంగానే వస్తుంది అని సంతోషించారు.
"""/"/
ఎందుకంటే రిషబ్ శెట్టి తెరకెక్కించిన సినిమాలు మంచి కంటెంట్ తో తెరకెక్కుతాయి.
అందుకే ఈయనతో సినిమా చేస్తే సూపర్ హిట్ అయినట్టే అని నమ్మారు.మరి తాజాగా రిషబ్ శెట్టి ఈ రూమర్ పై మాట్లాడారు.
ఈయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.ఎన్టీఆర్ తో ఎవరికీ సినిమా చేయాలనీ ఉండదు.
నాకు కూడా చేయాలని ఉంది అని.కానీ ప్రెజెంట్ తనకు అటువంటి ఆలోచన లేదని తెలిపారు.
ఈయన ఏదైనా స్టోరీ రాసుకున్న తర్వాతనే దానికి సరిపోయే నటీనటులను సెలెక్ట్ చేసుకోవడం తన అలవాటు అని అన్నారు.
బరువు తగ్గాలని భావిస్తున్నారా.. అయితే వెంటనే ఇది తెలుసుకోండి!